Rohit Sharma eats Barbados Grass: రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (India)ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup Final) ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది. ఈ విజయం సాధించిన తర్వాత భారత ఆటగాళ్లు సంబరాలతో సందడి చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సహా పలువురు ఆటగాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. భారత్‌ను చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ భిన్నంగా వ్యవహరించడం సోషల్‌ మీడియాను దున్నేస్తోంది. జగజ్జేతలుగా నిలిచిన తర్వాత రోహిత్‌ బార్బడోస్‌ పిచ్ మట్టిని తిన్నాడు. ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేయగా అందులో రోహిత్ పిచ్ మట్టిని రుచి చూస్తూ కనిపించాడు. ఈ క్షణాన్ని గుర్తుండిపోయేలా చేసేందుకు రోహిత్ ఇలా మట్టి తిన్నాడు. ఏం చేశాడో తెలిస్తే అతడిపై గౌరవం కూడా పెరుగుతుంది. బార్బడోస్ మైదానంలో రోహిత్‌ త్రివర్ణ పతాకాన్ని కూడా పాతాడు. రోహిత్ పిచ్‌ మట్టి తింటున్న వీడియోపై విభిన్న కామెంట్స్ వచ్చాయి. రోహిత్ గుండెలానిండా ఆనందం. భుజాలపై కుమార్తెతో గ్రౌండ్ లో తృప్తిగా తిరిగాడు రోహిత్ . 






టీమ్ ఇండియా విజయం తర్వాత హార్దిక్ పాండ్యా  కన్నీరు మున్నీరు అవుతూ కనిపించాడు. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ ను పాండ్యాకు అప్పగించాడు రోహిత్. తన బాధ్యతను చక్కగా నిర్వర్తించి భారత్‌ను విజయపథంలో నడిపించాడు. పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా టీమ్ ఇండియాలో కీలక పాత్ర పోషించాడు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ భారత్ విజయంలో కీలకంగా మారింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. 


అలాగే ఈ మ్యాచ్ తరువాత రోహిత్, కోహ్లీ ఇద్దరు తమ టీ 20 ప్రపంచ కప్ ప్రయాణానికి రిటైర్మెంట్ ప్రకటించారు.  ఇక టీ 20 వరల్డ్ కప్‌నకు ముందే తనకు ఇదే తన చివరిదని  అని టీం ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్ ప్రకటించేశాడు. మొత్తానికి  ఈ అద్భుత గెలుపుతో  ముగ్గురి కెరీర్‌ ఆనందంతో ముగిసింది.