India vs Australia 2nd ODI: రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో 1000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును అతను అడిలైడ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో వన్డేలో సాధించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 9 పరుగులు చేసి అవుట్ కాగా, విరాట్ కోహ్లీ సున్నాకే అవుట్ అయ్యాడు. వరుసగా రెండోసారి విరాట్ 'డక్' అవుట్ అయ్యాడు.

Continues below advertisement

రోహిత్ శర్మ గత మ్యాచ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు, అప్పుడు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 998 పరుగులు చేశాడు. ఈరోజు అతను కేవలం 2 పరుగులు చేయాల్సి ఉంది, అలా చేయగానే అతను చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాపై 1000 వన్డే పరుగులు చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలు కూడా ఇంతకు ముందు ఇలా చేయలేదు.

కోహ్లీ అభిమానులకు నచ్చని రికార్డు

వరుసగా రెండోసారి విరాట్ కోహ్లీ డకౌట్ గా ఔటయ్యాడు. అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో జేవియర్ బార్ట్లెట్ చేతిలో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కోహ్లీ రోహిత్ తో  మాట్లాడి, రివ్యూ తీసుకోకూడదని నిర్ణయించుకుని మైదానం నుంచి వెళ్లిపోయాడు. వన్డే చరిత్రలో కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్ లలో పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి.

Continues below advertisement

అంతకుముందు, టాస్ గెలిచిన తర్వాత, మిచెల్ మార్ష్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. శుభ్మాన్ గిల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇద్దరూ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు, కానీ గిల్ షాట్ కొట్టడానికి ప్రయత్నించినప్పుడు క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలోకి వచ్చాడు, విరాట్ కోహ్లీకి అడిలైడ్‌లో  మంచి రికార్డు ఉంది. అతను ఆడిన నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లలో రెండింటిలో సెంచరీలు సాధించాడు. ఈ మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో, కోహ్లీ 61.00 సగటు, 83.84 స్ట్రైక్ రేట్‌తో 244 పరుగులు చేశాడు. అందుకే అతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశించారు. అయితే, ఇక్కడ కూడా అతను డకౌట్ గా ఔటయ్యాడు.

సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా తన ప్లేయింగ్ ఎలెవెన్‌లో మూడు మార్పులు చేసింది. ఆడమ్ జంపా ఆడుతుండగా, భారత్ కూడా రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంచలేదు. రెండో వన్డేకు భారత్ తన ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు చేయలేదు. నేటి భారత ప్లేయింగ్ 11లో ముగ్గురు ఆల్ రౌండర్లు (నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్) ఆడుతున్నారు.

భారత్ ప్లేయింగ్ 11

రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టులో 3 మార్పులు

ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈరోజు విజయంతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లే అవకాశం ఉంది. మునుపటి మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించినప్పటికీ, రెండో వన్డే కోసం ఆస్ట్రేలియా మూడు మార్పులు చేసింది. అలెక్స్ కారీ, జేవియర్ బార్ట్‌లెట్, ఆడమ్ జంపా ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకుంది. .

మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, మాట్ రెషాన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.

గత 17 సంవత్సరాలుగా అడిలైడ్‌లో భారత్ ఓడిపోలేదు.

గత 17 సంవత్సరాలుగా భారత జట్టు అడిలైడ్‌లో ఒక్క వన్డే కూడా ఓడిపోలేదు. 2008 నుంచి, భారతదేశం ఇక్కడ ఐదు వన్డేలు ఆడింది, ఒక మ్యాచ్ టై అయింది. ఆ నాలుగింటిలో, భారతదేశం ఆస్ట్రేలియాను రెండుసార్లు, పాకిస్తాన్‌ను ఒకసారి, శ్రీలంకను ఒకసారి ఓడించింది.