Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
తను కెప్టెన్ గా ఉన్నప్పుడు జట్టు ఎంపికలో కోహ్లీ జోక్యం చేసుకునేవాడని, అతడి ఇష్టాన్ని బట్టే ప్లేయర్ల స్థానాలు డిసైడ్ అయ్యేవని మాజీ క్రికెటర్ ఆరోపణ. ఈ వివాదంలో ఇద్దరు తెలుగు వాళ్ల పేర్లు ఉండటం విశేషం.

3d Player News: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై తన ప్రశ్నల బాణాలను మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంధస్తూనే ఉన్నాడు. యువరాజ్ సింగ్ కెరీర్ అర్థాంతరంగా ముగియడానికి కారణం కోహ్లీనే అని తేల్చిన ఉతప్ప.. తాజాగా తెలుగు మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడి గురించి కూడా చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్ లో రాయుడు.. టీమిండియాలోకి ఎంపిక కాకపోవడానికి గల కారణం కోహ్లీనే అని కుండబద్దలు కొట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోహ్లీకి నచ్చని వారికి టీమిండియాలో ఎంట్రీ క్లోజ్ అవుతుందని, అతని రాగద్వేషాలపైనే అప్పట్లో జట్టు ఎంపిక నడిచేదని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ లో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ కు రాయుడు కచ్చితంగా ఎంపికవుతాడని అందరూ భావించారు. అయితే సడెన్ గా రాయుడు ప్లేస్ లో తమిళనాడుకు చెందిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. అప్పట్లో ఈ ఘటన సెన్సెషన్ అయింది. తాజాగా ఈ ఘటన వెనకాల కారణంగా కోహ్లీనే అని ఉతప్ప ఆరోపిస్తున్నాడు.
త్రీడీ ప్లేయర్ వివాదం..
నిజానికి 2019 వన్డే ప్రపంచకప్ కు చీఫ్ సెలెక్టర్ గా తెలుగు ప్లేయర్ ఎమ్మెస్కే ప్రసాద్ పని చేశాడు. అతని నాయకత్వంలోనే టీమిండియాను ఎంపిక చేశాడు. రాయుడుని కాకుండా విజయ్ శంకర్ ను ఎంపిక చేయడం, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో పనికొచ్చే త్రీడి ప్లేయర్ తను అని ఎమ్మెస్కే తన ఎంపికను సమర్థించుకున్నాడు. అప్పటి నుంచి విజయ్ శంకర్ కు త్రీడీ ప్లేయర్ అని పేరు స్థిరపడి పోయింది. ఆ సెలెక్షన్ పై ఫైరయిన రాయుడు.. వన్డే ప్రపంచకప్ చూడటానికి త్రీడి కళ్లద్దాలను ఇప్పుడే ఆర్డర్ చేశానని సోషల్ మీడియాలో వివాదస్పదమైంది. ఎమ్మెస్కేపై కోపంతోనే అతను ఇలా చేశాడని అందరూ భావించారు. దీనిపై అప్పట్లో వాడి వేడి చర్చ జరిగింది. అయితే తాజాగా ఈ ఘటన వెనక ప్రధాన కారకుడు కోహ్లీయే అని ఉతప్ప బాంబ్ పేల్చడం కలకలం రేగింది. కోహ్లీ వ్యవహార శైలి వలనే అప్పటి భారత ప్లేయర్లు ఇబ్బంది పడ్డారని పలు ఉదాహరణలతో వివరిస్తున్నాడు.
నొత్తి నోరు కొట్టుకున్న ఎమ్మేస్కే..
మరోవైపు రాయుడుని జట్టులోకి ఎంపిక చేయక పోవడానికి గల కారణం ఎమ్మేస్కే ప్రసాదేనని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక అటు రాయుడు, ఇటు ప్రసాద్ ఇద్దరు తెలుగువాళ్లే కావడంతో తెలుగు నాట కులచర్చ కూడా జరిగింది. కాపు కులస్తుడైన రాయుడుని, కమ్మ కులస్తుడైన ప్రసాద్ తొక్కేశాడని పలువురు ఫైరయ్యారు. తను జట్టులోకి ఎంపిక కాలేకపోవడానికి గల కారణం ప్రసాదేనని రాయుడు భావించినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై గతంలో ప్రసాద్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. రాయుడుlr ఎంపిక చేయకపోవడమనేది కెప్టెన్ కోహ్లీతోపాటు టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయమని నొత్తి నోరు కొట్టుకుని చెప్పాడు. అయితే అప్పట్లో ఈ వాదనను ఎవరూ అంగీకరించకపోయినా, ఉతప్ప తాజా స్టేట్మెంట్ తో ఈ వార్తల్లో నిజముందని తెలుస్తోంది. ఏదేమైనా తనపై రోజుకో ఆరోపణ చేస్తున్న ఉతప్పకు కోహ్లీ తగిన జవాబివ్వాలని అతని అభిమానులు భావిస్తున్నారు. తను కూడా సోషల్ మీడియాలోకొచ్చి తన వంతు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నారు.