ICC Champions Trophy Live Updates: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న సెమీస్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని ఎడమి చేతి అరచేతికి ఉన్న ప్లాస్టర్ ను తీసేయ్యాలని అంపైర్ కోరాడు. నిజానికి గాయంతో బాధపడుతున్న జడేజా.. అందుకు ఉపశమనంగా చేతికి ప్లాస్టర్ ధరించాడు. అయితే జడేజా బౌలింగ్ వేసేది ఎడమ చేతితోనే కావడంతో, ప్లాస్టర్ వేయడం బ్యాటర్లకు ఇబ్బందిగా మారిందని అంపైర్లు భావించారు. దీనిపై బ్యాటర్లు ఫిర్యాదు చేశారేమో తెలియదు కానీ, అంపైర్ మాత్రం తన చేతికి ఉన్న ప్లాస్టర్ ను తొలగించమని ఆదేశించాడు. దీంతో జడేజా చేతికున్న ప్లాస్టర్ ను తీసేసి, బౌలింగ్ చేశాడు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గాయం తగిలితే చేతికి ధరించిన ప్లాస్టర్ ను తొలగించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్లాస్టర్ తెలుపు రంగులో ఉండటం వల్ల బ్యాటర్లకు బంతి సరిగ్గా కనిపించదని, అందుకే అంపైర్లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
తర్వాత ప్లాస్టర్ ధరించిన జడేజా..ఇక అంపైర్ చెప్పిన వెంటనే జడేజా తన చేతికున్న ప్లాస్టర్ ను తొలగించాడు. అయితే కాసేపటికే బ్యాటర్ కొట్టిన బంతిని ఆపే క్రమంలో చేతికి గాయమైంది. అయితే అంతకుముందు అయిన ప్లేస్ లోనే గాయం కావడం విశేషం. దీంతో జడేజా మళ్లీ గోధుమ రంగు ప్లాస్టర్ ధరించి బౌలింగ్ చేశాడు. ఇక సెమీస్ మ్యాచ్ పోటాపోటీగా జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ డ్రింక్స్ విరామానికి 40 ఓవర్లలో 6 వికెట్లకు 213 పరుగులు చేసింది. కెప్టెన్ స్మిత్ అర్థ సెంచరీ చేశాడు.
రోహిత్ కు మద్ధతిచ్చిన గావస్కర్..శరీరాకృతిపై వచ్చిన విమర్శలపై రోహిత్ కు అండగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ నిలిచాడు. క్రికెట్ లో నాజుకు తనం అవసరం లేదని, చక్కగా ఆడితే సరిపోతుందని పేర్కొన్నాడు. నాజుకైన ఆటగాళ్లు కావాలనుకుంటే ఫ్యాషన్ షోలకు వెళ్లాలని చురకలు అంటించాడు. గతంలో కూడా శరీరాకృతి విషయంలో భారత ఆటగాళ్లు విమర్శల పాలయ్యారని, ఇది అనవసరమని పేర్కొన్నాడు. రోహిత్ మాదిరిగానే సర్ఫరాజ్ ఖాన్ బొద్దుగా ఉండటంతో అతని ఫిట్ నెస్ పై విమర్శలు వ్యక్తమయ్యాయని, ఒక మ్యాచ్ లో 150 పరుగులు చేయడంతోపాటు వరుసగా అర్ధ రసెంచరీలు సాధించాడు. మరోవైపు రోహిత్ పై విమర్శలు చేసిన కాంగ్రెస్ లీడర్ షమా మహ్మద్ తన పోస్టును డిలీట్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అక్షింతలు వేసింది. ఇక పలువురు క్రికెట్ అభిమానుల నుంచి కూడా తనకు నిరసన వ్యక్తమైంది.