దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజరా సత్తా చాటాడు. ఈ నయా వాల్ భారీ శతకంతో సెలక్టర్లకు హెచ్చరికలు పంపాడు. కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పుజారా... జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో రంజీ ట్రోఫీని ఘనంగా ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా..తొలి మ్యాచ్‌లోనే భారీ శతకంతో చెలరేగాడు. ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ జట్టు ప్రకటనకు ముందు.. తానూ రేసులోనే ఉన్నానంటూ బీసీసీఐ సెలక్టర్లకు పుజారా గట్టి సందేశం ఇచ్చాడు.
నయా వాల్ భారీ శతకం
రాజ్‌కోట్ వేదికగా జార్ఖండ్‌తో మొదలైన ఐదు రోజుల మ్యాచ్‌లో పుజారా సెంచరీతో మెరిశాడు. పుజారా డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు.
జార్ఖండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది. జార్ఖండ్ 142 పరుగులకే ఆలౌట్ అయింది. పేసర్ చిరాగ్ జాని ఐదు వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్ హర్విక్ దేశాయ్ 85 పరుగులు సాధించి శుభారంభం అందించాడు. వన్‌డౌన్ బ్యాటర్ షెల్డన్ జాక్సర్ కూడా అర్ధ శతకం.. అర్పిత్ వసవాడ 68 పరుగులు చేశారు. పుజారా 239 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 157 పరుగులతో క్రీజులో ఉండగా.. ప్రేరక్ మన్కడ్ 23 పరుగులతో అజేయంగా ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 406 పరుగుల భారీ స్కోరు సాధించింది. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
రింకూసింగ్ కూడా...
టీమ్‌ఇండియా(Team India) నయా ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీ 20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ రింకూపై భారీ ఆశలు ఉన్నాయి. ఇప్పుడు టెస్టుల్లో కూడా రాణిస్తూ ఆశలు పెంచుతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీ 2024(Ranji Trophy 2024) సీజన్‌లో కేరళ(Kerala)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తరపున బరిలోకి దిగిన రింకూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో రింకూ కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 136 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో ఉత్తరప్రదేశ్ జట్టును ఆదుకున్నాడు. రింకూ, ధ్రువ్ జురెల్(63)తో రాణించడంతో యూపీ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, కేరళ బౌలర్ల విజృంభణతో 302 పరుగులకే ఆలౌటయ్యింది. 124 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన ఉత్తర ప్రదేశ్ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో బరిలోకి దిగిన రింకూ.. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. దృవ్ జురెల్‌తో కలిసి రింకూ 143 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు.
చరిత్ర సృష్టించిన వైభవ్
దేశవాళీ అత్యున్నత క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో బీహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. కేవలం 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలోకి బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ రంజీల్లోకి అరంగేట్రం చేశాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ముంబైతో మొదలైన మ్యాచ్‌లో బీహార్ తరఫున వైభవ్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన వైభవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.