Ranji Trophy Final, MUM vs VID, Day 1 Vidarbha trail Mumbai by 193 runs:  దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్‌(Ranji Trophy Fina) రసవత్తరంగా సాగుతోంది. ఫైనల్లో ముంబై, విదర్భ(MUM vs VID) రంజీ టైటిల్‌ కోసం తలపడతుండగా... తొలి ఇన్నింగ్స్‌లో ముంబై తక్కువ పరుగులకే పరిమితమైంది. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన  ముంబై 224 పరుగులకు ఆలౌటైంది. కష్టాల్లో కూరుకుపోయిన ముంబై జట్టు 224 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించిందంటే దానికి కారణం శార్దూల్‌ ఠాకూర్‌. 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి 200 పరుగులైనా చేస్తుందా అన్న స్థితి నుంచి ముంబైకు శార్దూల్‌ గౌరవప్రదమైన స్కోరు అందించాడు.



ముంబై బ్యాటింగ్‌..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి మంచి ఆరంభమే దక్కింది. వాంఖడే మైదానంలో  ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్‌ లల్వాని (37) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఓ దశలో 81-1 స్కోరుతో మెరుగైన స్థితిలో కనిపించిన ముంబై 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. రహానే(7), శ్రేయాస్‌ అయ్యర్‌(7) తక్కువ పరుగులకే వెనుదిరగగా... శార్దుల్‌ ఠాకూర్‌ వన్డే తరహాలో ఆడి 69 బంతుల్లో 75 పరుగులు చేశాడు.ఈ తరుణంలో శార్దుల్‌ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గాడిలో పడేశాడు.  . ముషీర్‌ ఖాన్‌ (6) విఫలమయ్యాడు. శార్దుల్‌ సాధికారిక ఇన్నింగ్స్‌తో ముంబై తేరుకుంది. హర్ష్‌ దూబే, యశ్‌ ఠాకూర్‌ మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన విదర్భ 3 వికెట్లకు 31 పరుగులు చేసింది. అథర్వ (21), ఆదిత్య (0) క్రీజులో ఉన్నారు. ధవల్‌కులకర్ణి రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్‌ (1/14) ఓ వికెట్‌ సాధించాడు. ముంబై స్కోరుకు విదర్భ ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. 



బీసీసీఐ నజరాన
టెస్టు క్రికెట్‌ను ఎక్కువ మంది క్రికెటర్లు ఆడేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంది. టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఒక సీజన్‌లో కనీసం 50 శాతం కంటే ఎక్కువ టెస్టులు ఆడితే  30 లక్షల నుంచి 45 లక్షలు అదనంగా చెల్లిస్తామని జై షా ప్రకటించారు. రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లకు ఇందులో సగం ఇస్తామని ప్రకటించారు. టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి... ఆటగాళ్లను ప్రోత్సహించడానికి.. ఈ అద్భుత స్కీమ్‌ను తీసుకొచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కొత్త స్కీమ్ 2022-23 సీజన్ నుంచి అమలులోకి రానుంది. ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు బీసీసీఐ ఒక్కో సీజన్‌కు అదనంగా రూ.40 కోట్లు కేటాయించింది.  కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి క్రికెటర్లు.. టెస్టు క్రికెట్‌ను కాదని ఐపీఎల్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. . ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐ... సెంట్రల్‌ కాంట్రాక్టులో ఉండి టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులను పెంచడంతో పాటు బోనస్‌ కూడా ప్రకటించింది.