సోమవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఆఖరి రోజులు ఎనిమిది వికెట్లు తీసి విజయం సాధించాలనుకున్న టీమిండియా వ్యూహాన్ని వరుణుడు దెబ్బతీశాడు. 2-0తో సిరీస్ వైట్‌వాష్‌ చేయాలనుకున్న రోహిత్‌ ప్రయత్నానికి కుండపోత వర్షం అడ్డుకట్ట వేసింది. 


డొమినికాలో మూడు రోజుల్లోనే విజయం సాధించిన తర్వాత క్లీన్ స్వీప్‌పై దృష్టి సారించిన భారత్ ఇక్కడ ఆతిథ్య జట్టుకు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి రోజు ఆట వాష్ అవుట్ అయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 


నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ను 289 పరుగుల వెనుకంజలో ఉంది. రెండు వికెట్లు కోల్పోయి ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 సైకిల్‌లో రెండో టెస్టు విజయం సాధించి, పూర్తి 24 పాయింట్లు కైవసం చేసుకునే అవకాశం వచ్చింది. భారీ వర్షాల కారణంగా అది వీలుకాలేదు. 


దాదాపు రెండున్నర గంటల తర్వాత పిచ్‌పై కవర్‌లు తీసినా ప్రయోజనం లేకపోయింది. మేఘాలు ఆటకు అంతరాయం కలిగించాయి. ఆట మొదట స్థానిక కాలమానం ప్రకారం 13.15 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. గ్రౌండ్స్‌మెన్ ప్లేయింగ్ ఏరియాను మ్యాచ్‌కు సిద్ధం చేస్తున్న సమయంలో వర్షం మళ్లీ పడింది. కాసేపు ఆ ప్రయత్నాలను ఆపేశారు. కాసేపటికి వర్షం ఆగిపోయింది. అయితే మ్యాచ్‌ను కొనసాగించే వాతావరణం లేకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. 






చందర్‌పాల్ (24 బ్యాటింగ్) బ్లాక్‌వుడ్ (20) ద్వయం వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌ను 76 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించాల్సి ఉంది. కానీ ఉదయం నుంచి వర్షం పడటం, సాయంత్రానికి  వాన తగ్గినప్పటికీ క్వీన్స్ పార్క్ ఓవల్‌పై భారీ మేఘాలు కమ్ముకోవడంతో ఆటను కొనసాగించలేకపోయారు. 


రెండో టెస్టు మ్యాచ్‌ గెలిచి 24 పాయింట్లను జట్టు ఖాతాలో వేద్దామని రోహిత్ చేసిన ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. 12 పాయింట్ల సంపాదించాలంటే టీమిండియా చివరి రోజున 8 మంది వెస్టిండీస్‌ బ్యాటర్లను ఔట్ చేయాల్సి వచ్చింది. WTCలో ఒక టెస్ట్ గెలిచిన అన్ని జట్లకు ఒక్కో మ్యాచ్‌కి మొత్తం 12 పాయింట్లు ఇస్తారు. 


పాయింట్ల పట్టిక ప్రకారం, మ్యాచ్ డ్రాగా ముగియడంతో టీమిండియా, విండీస్‌ జట్టు చెరో నాలుగు పాయింట్లు సాధించగలిగాయి. WTC సైకిల్‌లో టెస్టు మ్యాచ్‌ టై అయినట్లయితే పరిస్థితిని బట్టి 12 పాయింట్లను రెండు జట్లు సమానంగా పంచుకుంటాయి.


తొలి టెస్టులో సాధించిన భారత్ 12 పాయింట్లు సాధించి పెకింగ్ ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్‌ ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. 


ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ లభించింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఫాస్ట్ బౌలర్ 5 వికెట్లు పడగొట్టాడు.