Ajinkya Rahane Tough Waiting Phase in Team India: ఇండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ అజింక్యా రహానే తన సుదీర్ఘ కేరియర్ లో ఎదుర్కొన్న మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ గురించి సన్సేషనల్ విషయాలు షేర్ చేసుకున్నాడు. 2011 లో వైట్ బాల్ ఫార్మాట్ లో డెబ్యూ చేసినప్పటికీ, తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి రెండేళ్లపాటు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. టీమ్ తో కలసి ప్రయాణించినా మ్యాచ్ ఆడకుండా రెండేళ్లపాటు ట్వెల్త్ మ్యాన్ గా బెంచ్ కే పరిమితమవ్వడం చాలా ఫ్రస్ట్రేషన్ ఇచ్చినట్లు తెలిపాడు. ఎట్టకేలకు 2013 లో ఆస్ట్రేలియాపై రహానే టెస్ట్ డెబ్యూ చేశాడు.
20 మ్యాచ్ ల నిరీక్షణ.. ట్వెల్త్ మ్యాన్ గా క్రూషియల్ లెసన్స్తన యూట్యూబ్ ఛానెల్ లో రహానే మాట్లాడుతూ "2011 లో టీమ్ లోకి వచ్చాక టెస్ట్ డెబ్యూ కోసం 20 మ్యాచ్ లు ఆగాల్సి వచ్చింది. ఆ రెండేళ్లు ట్వెల్త్ మ్యాన్ గానే ఉన్నా. అది చాలా ఛాలెంజింగ్ ఫేజ్ అయినా చాలా విషయాలు నేర్చుకున్నా. సింపథీ కోరుకోవడం లేదా నన్ను నేను బెటర్ చేసుకోవడం అనే టూ ఆప్షన్స్ నా ముందు ఉండేవి. వాటర్ బాటిళ్లు అందిస్తూ ప్లేయర్లకు హెల్ప్ చేయడం తప్పు కాదు, దాన్ని పాజిటివ్ గా తీసుకున్నా. మ్యాచ్ లను గమనించడం వల్ల నా మైండ్ సెట్, ఆటిట్యూడ్ ఛేంజ్ అయ్యాయి" అని వివరించాడు.
ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణం.. పేషన్స్ నేర్పిన జీవితంస్టార్ట్ లో తనకి అంత పేషన్స్ ఉండేది కాదని, టైమ్ తో పాటు ఎక్స్‌పీరియన్స్ పెరిగాక అది డెవలప్ అయిందని రహానే తెలిపాడు. "ముంబై లోకల్ ట్రైన్లలో ట్రావెల్ చేయడం చాలా ఛాలెంజింగ్. నాలోని ఓపిక అక్కడి నుంచే స్టార్ట్ అయింది. డొమెస్టిక్ క్రికెట్ లో కంటిన్యూయస్ గా రన్స్ కొడుతున్నప్పుడు ఇండియా టీమ్ కి సెలెక్ట్ అవ్వాలని ఎవరికైనా అనిపిస్తుంది. నాకూ అలాగే అనిపించింది. కానీ సీనియర్ ప్లేయర్లతో మాట్లాడాక జరగాల్సింది టైమ్ వచ్చినప్పుడే జరుగుతుందని గ్రహించా. లాంగ్ టైమ్ ఆడాలంటే పేషన్స్ చాలా క్రూషియల్" అని చెప్పాడు.
సీనియర్ల సలహాలు.. ఇండియా తరఫున సుదీర్ఘ ప్రయాణంతన కంట్రోల్ లో ఉన్న డొమెస్టిక్ పర్ఫార్మన్స్ పైనే ఫోకస్ పెట్టి పేషన్స్ తో వెయిట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ లెవల్ లో చాలా ఏళ్లు సక్సెస్ ఫుల్ గా ఆడగలిగానని మాజీ క్రికెటర్ తెలిపాడు.
