Ind Vs Eng Series: ఆ ఇద్దరు ఆటగాళ్లు అప్రోచ్ మార్చుకోవాలి.. లేకపోతే కష్టం: దిగ్గజ స్పిన్నర్ అశ్విన్

భారత బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని తప్పులు దొర్లాయని వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ముఖ్యంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఓపెనర్ సంజూ శాంసన్ పదే పదే విఫలం కావడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. 

Continues below advertisement

R Ashwin Comments: ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను 4-1తో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ ను విశ్లేషించిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. భారత బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని తప్పులు దొర్లాయని వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ముఖ్యంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఓపెనర్ సంజూ శాంసన్ పదే పదే విఫలం కావడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. వీరిద్దరూ ఈ టోర్నీలో ఘోరంగా విఫలమయ్యారు. సంజూ కేవలం 51 పరుగులు మాత్రమే చేయగా, సూర్య కుమారు యాదవ్ 28 రన్స్ బాదాడు. ప్రత్యర్థులు వీరి వీక్నెస్ కనిపెట్టి ఔట్ చేస్తున్నారని, దీని నుంచి వీరు బయటపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. 

Continues below advertisement

ప్రతివ్యూహం రచించాలి..
ఈ సిరీస్ లో శాంసన్ ను షార్ట్ బాల్ ద్వారా, సూర్యను లెగ్ స్టంప్ పై పికప్ షాట్ ద్వారా ఇంగ్లీష్ బౌలర్లు ఔట్ చేశారు. పదే పదే ఒకే తరహాలో ఔట్ అవుతూ అభిమానులకు కూడా చిరాకు తెచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై అశ్విన్ స్పందించాడు. ప్రత్యర్థులు కవ్వించే బంతులు విసురుతున్నప్పుడు, కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నాడు. అలాగే వాళ్లు మైండ్ గేమ్ ఆడుతున్నప్పుడు, మన బ్యాటర్లు కూడా ప్రతి వ్యూహంతో దాడి చేయాలని సూచించాడు. ఈ సిరీస్ లో ఈ ఇద్దరు బ్యాటర్లను చూసినప్పుడు తనకు రజనీ కాంత్ సినిమా గుర్తుకు వచ్చిందని సరదాగా వ్యాఖ్యానించాడు. తమిళ సినిమా తల్లు మల్లు అనే సినిమాలో హీరో వ్యవహరించిన మాదరిగానే వీళ్లు కూడా క్రికెట్ ఆడారని సరదాగా వ్యాఖ్యానించాడు. ఏదేమైనా ఇన్నాళ్లుగా పుల్ షాట్, పికప్ షాట్.. సంజూ, సూర్యల బలంగా ఉండేదని, దీనిని ఇప్పుడు బలహీనగా మార్చారని ఇంగ్లీష్ బౌలర్లని ప్రశంసించాడు. 

కఠినంగా ప్రాక్టీస్ చేసినా..
షార్ట్ బాల్ ను ఎదుర్కునేందుకు సంజూ కఠినమైన ప్రాక్టీస్ చేశాడని అశ్విన్  చెప్పుకొచ్చాడు. తనకున్న సమాచారం ప్రకారం తను ప్లాస్టిక్ బంతితో ఆడటం, స్టాన్స్ మార్చుకుని మరీ సిద్ధమయ్యాడని, అయినా ఫలితం దక్కలేదని పేర్కొన్నాడు. ఏదేమైనా వీళ్లు ఈ వైఫల్యాల బాట నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఇద్దరి ఆటగాళ్లపై సోషల్ మీడియాలో భారత అభిమానులు జోకులు పేలుస్తున్నారు. భారత్ సిరీస్ గెలిచింది కాబట్టి సరిపోయిందని లేకపోతే వీరిద్దరి ప్లేస్ పై సందేహాలు వచ్చేవని ఫైరయ్యారు. చెత్త ఆటతీరుతో ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యంగా గతేడాది కెప్టెన్ గా ఎంపికయ్యాక సూర్య.. ఒక గొప్ప ఇన్నింగ్స్ కూడా ఆడలేక పోయాడని, యువ ఆటగాళ్లు కష్టపడి కప్పులు సాధిస్తుంటే, తను కెప్టెన్ గా దాన్ని ఆస్వాదిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ ఇద్దరు ఆటగాళ్లు కేవలం టీ20లకే పరిమితమవడంతో మళ్లీ వచ్చే అంతర్జాతీయ మ్యాచ్ ఆగస్టులో జరుగనుంది. బంగ్లాదేశ్ గడ్డపై భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. అప్పటికల్లా బాగా ప్రాక్టీస్ చేసి గాడిలోకి రావాలని కోరుకుంటున్నారు. 

Also Read: Sanju Samson Injury:  సంజూ శాంసన్ కి గాయం.. 5 వారాలపాటు దూరం.. ఐపీఎల్ నుంచే తిరిగి బరిలోకి..

Continues below advertisement