PCB set to reappoint Babar Azam as captain: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(Pakistan Cricket Board) మరో సంచలన నిర్ణయానికి తెర లేపింది. 2024 టీ20 ప్రపంచకప్‌కు ముందు బాబర్ అజామ్( Babar Azam)ను తిరిగి కెప్టెన్‌గా నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది.గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్( world Cup 2023)లో చెత్త ప్రదర్శన చేసిన నేపథ్యంలో పాక్ కెప్టెన్సీ పదవికి బాబార్ ఆజమ్ రాజీనామా చేశాడు. దీంతో షాహీన్ షా ఆఫ్రిది పాకిస్తాన్ క్రికెట్ జట్టు బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కెప్టెన్‌ను మార్చే ఆలోచనలో పడింది. షహీన్ స్థానంలో మొహమ్మద్ రిజ్వాన్ , బాబర్ ఆజంలు రేసులో ఉన్నారు. అయితే, ఇటీవలి పరిణామాలు బాబర్‌ను మరోసారి కెప్టెన్సీకి ప్రాథమిక అభ్యర్థిగా నిలిపాయి. అయితే గతంలో జరిగిన సంఘటనలతో బాబర్ అజామ్ ఈ పదవి పట్ల సుముఖంగా లేరని.. మరోసారి బాధ్యతలు స్వీకరించేందుకు సంకోచిస్తున్నారని పాకిస్తాన్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అతను కొన్ని విషయాలకు సంబంధించి బోర్డు నుండి హామీని కోరుతున్నాడనీ , అవన్నీ పరిష్కరించినప్పుడు మాత్రమే కెప్టెన్సీని తిరిగి స్వీకరించడానికి అంగీకరిస్తాడని సమాచారం.
2023 ప్రపంచ కప్ తర్వాత బాబర్ అజామ్ తన వైట్-బాల్ కెప్టెన్సీ నుండిబయటపడ్డాడు. దీంతో షాహీన్ ఆఫ్రిది T20I నాయకత్వాన్ని తీసుకున్నాడు. తరువాత బాబర్ కూడా రెడ్-బాల్ కెప్టెన్సీ నుండి వైదొలిగాడు, దీంతో షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఇన్ని మార్పులు జరిగినా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఏమాత్రం మెరుగుపడలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో మూడు టెస్టుల్లోనూ ఓడిపోయింది, అలాగే న్యూజిలాండ్‌లో జరిగిన T20I సిరీస్‌లో 1-4 తేడాతో ఓటమిపాలయ్యింది.
సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్
మరికొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్(T20 World Cup) ఆరంభం కానున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది. ప్రస్తుతం కొనసాగతున్న సెలెక్షన్ కమిటీని రద్దు చేస్తున్నామని.... కొత్త కమిటీని త్వరలోనే ప్రకటిస్తామని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్‌తో సమావేశమైన తర్వాత నఖ్వీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమధ్యే పీసీబీ ఏడుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో మాజీ ఆటగాళ్లు అబ్దుల్ రజాక్, అసద్ షఫీక్, మహమ్మద్ యూసుఫ్, వాహబ్ రియాజ్, కెప్టెన్, హెడ్‌కోచ్, డేటా అనలిస్ట్‌లకు చోటు దక్కింది. అయితే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లో పాక్ జట్టు చెత్త ఆటతో నిరాశపరిచింది. దాంతో, సెలక్షన్ కమిటీపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ వేటు వేశారు. మరోవైపు ఆటగాళ్లు ఫిట్నెస్ విషయంలో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దగా దృష్టి పెట్టడం లేదని.. అందుకే జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరు కూడా పెద్దగారాణించడం లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి విమర్శలు వేళ ఇక ఆటగాళ్ల ఫిట్నెస్ను మరింత మెరుగుపరిచే విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.