Pathum Nissanka becomes first Sri Lanka player to hit double century in ODI cricket: శ్రీలంక యువ బ్యాటర్ పాతుమ్ నిస్సంక డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అఫ్గానిస్థాన్‍తో జరుగుతున్న తొలి వన్డేలో ద్విశతకంతో సత్తాచాటాడు. శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక మెరుపు ద్విశతకంతో (139 బంతుల్లో 210 నాటౌట్‌; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. కేవలం 136 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ మార్కును చేరిన నిస్సంక.. వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో క్రిస్‌ గేల్‌ (138 బంతుల్లో), వీరేంద్ర సెహ్వాగ్‌ (140 బంతుల్లో)  రికార్డులను నిస్సంక అధిగమించాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కేవలం 126 బంతుల్లోనే డబుల్‌ బాదాడు. రెండో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ఆసీస్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (128) పేరిట ఉంది. వన్డేల్లో డబుల్‌ నమోదు చేసిన తొలి శ్రీలంక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

 

వన్డేల్లో డబుల్‌ సెంచరీలు

రోహిత్ శర్మ - 3 

సచిన్ టెండూల్కర్ - 1

వీరేంద్ర సెహ్వాగ్ - 1

గ్లెన్ మాక్స్‌వెల్ - 1

క్రిస్ గేల్ - 1

ఇషాన్ కిషన్ - 1

శుభ్‌మన్ గిల్ - 1

మార్టిన్ గప్టిల్ - 1

ఫకర్ జమాన్ - 1

పాతుమ్ నిస్సంక - 1

శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పటి వరకు సనత్ జయసూర్య (189) పేరిట ఉండేది. దాన్ని నిస్సంక ఇప్పుడు ద్విశతకంతో బద్దలుకొట్టాడు. శ్రీలంక తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాతుమ్ నిస్సంక ద్విశతకంతో చెలరేగడంతో ఈ తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఏకంగా 50 ఓవర్లలో 3 వికెట్లకు 381 పరుగుల భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం 382 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పరాజయం వైపు సాగుతోంది. 

 

రోహిత్ శర్మ ODIల్లో రికార్డు 3 డబుల్ సెంచరీలు చేశాడు. సరిగ్గా ఇదే రోజు రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు. 2013 నవంబర్ 2న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 158 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్సర్లతో మొత్తం 209 పరుగులు చేశాడు. తొలి 101 పరుగులకు 117 బంతులు ఆడిన రోహిత్ తర్వాతి 108 పరుగులను 41 బంతుల్లోనే చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 2014లో రోహిత్ శర్మ మరోసారి డబుల్ సెంచరీ చేశాడు. 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 173 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 153 బంతులు 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెహ్వాగ్ కూడా డబుల్ సెంచరీ చేశాడు.