PAK vs ENG, T20 WC 2022 Live Streaming: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో ఆఖరి మ్యాచుకు అంతా రెడీ! సెమీ ఫైనల్‌ విజేతలు ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ ఫైనల్లో తలపడుతున్నాయి. మరి ఈ మ్యాచ్‌ వేదిక, లైవ్‌ టెలికాస్ట్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, జట్ల వివరాలు మీ కోసం!


When Does Pakistan vs England Final match Begin (Date and Time in India) in ICC T20 World cup 2022?


పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ ఫైనల్‌ టీ20 వేదిక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. 1:00 గంటలకు టాస్‌ వేస్తారు. 


Where to Watch Pakistan vs England Final match?


ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022 ప్రసార హక్కులను స్టార్‌ స్పోర్ట్స్‌ ఇండియా గెలుచుకుంది. మ్యాచులన్నీ స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానళ్లలో ప్రసారం అవుతాయి. స్టార్‌సోర్ట్స్‌ 1, స్టార్‌స్పోర్ట్స్‌ 1హెచ్‌డీ, స్టార్‌ స్పోర్ట్స్‌ హిందీ ఛానళ్లలో వీక్షించొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, మళయాలం భాషాల్లో చూడొచ్చు.


How to Watch Pakistan vs England Final match Live Streaming Online for Free in India?


టీ20 ప్రపంచకప్‌ మ్యాచులను లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.


ICC T20 World Cup 2022 Schedule


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 16 మొదలైంది. నవంబర్‌ 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది.


Pakistan vs England Final T20 match ProbableXI


ఇంగ్లాండ్‌: జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌, ఫిలిప్‌ సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, హ్యారీ బ్రూక్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌


పాకిస్థాన్‌: మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ హ్యారిస్‌, షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ నవాజ్‌, మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌, నసీమ్‌ షా, హ్యారిస్‌ రౌఫ్‌, షాహిన్ అఫ్రిది