Devdutt Padikkal Powers India Galle Test:  శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలి రోజు ఇండియా భారీ స్కోరు దిశగా సాగగా, రెండో రోజు ఉదయం నుంచి భారీ వర్షం కారణంగా దాదాపు ఐదు గంటల పాటు ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం 2:35 గంటలకు ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత భారత్ భారీ స్కోరు సాధించింది. ఆదివారం రెండో రోజు ఆట‌ముగిసేస‌రికి  116 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 460 ప‌రుగులు చేసింది. లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు కుల్దీప్ యాద‌వ్ (12), ప్ర‌సిధ్ కృష్ణ (1) క్రీజులో ఉన్నారు. ప్ర‌భాత్ జ‌య‌సూర్య‌కు నాలుగు వికెట్లు ద‌క్కాయి. రెండో రోజు శ్రీలంక బౌలర్లు కొత్త బంతితో ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. తొలి 90 నిమిషాల వ్యవధిలోనే రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వికెట్లు తీసి పర్యాటక జట్టుపై ప్రెజర్ క్రియేట్ చేశారు.

Continues below advertisement

Continues below advertisement

పడిక్కల్ డబుల్ సెంచరీ మిస్.. జయసూర్య, నువాంత దెబ్బఇక ఆట ప్రారంభ‌మైన కాసేప‌టికి లంక అరంగేట్ర బౌలర్ కేశర నువాంత పిచ్ నుంచి వచ్చిన టర్న్, బౌన్స్ ను అద్భుతంగా వాడుకుంటూ ఇండియన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. రిషభ్ పంత్ (39) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోగా, రిటైర్డ్ హ‌ర్ట్ హ‌ర్ట్ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన కేఎల్ రాహుల్ (82) షార్ప్ టర్న్ బంతికి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా (13)ను కూడా త్వరగానే అవుట్ చేశారు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత క్లాస్ తో బ్యాటింగ్ చేశాడు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన పడిక్కల్ 167 రన్స్ చేసి లంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ.. మానవ్ సుతార్ తో కీలక భాగస్వామ్యంజడేజా అవుటైన తర్వాత స్కోరు 377/6 వద్ద ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (51) ధాటిగా ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆశించినట్లుగానే లోయర్ ఆర్డర్ లో మానవ్ సుతార్ (24)తో కలిసి 55 రన్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వేగంగా ఆడుతూ 51 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జురెల్, జట్టు స్కోరును 400 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. జయసూర్య బౌలింగ్ లో జురెల్ అవుట్ అయినా, జట్టుకు కావాల్సిన పటిష్ట స్థితిని అందించాడు.

వర్షం అంతరాయాలు.. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో గ్రౌండ్ స్టాఫ్ సూపర్ సాపర్ల సహాయంతో శ్రమించి గ్రౌండ్ ను సిద్ధం చేశారు. కేశర నువాంత 3 వికెట్లు పడగొట్టారు. రాబోయే రోజుల్లోనూ వర్షం పడే అవకాశాలు ఉన్నప్పటికీ, గాలే పిచ్ స్పిన్ కు పూర్తి స్థాయిలో అనుకూలిస్తుండటంతో ఇండియన్ స్పిన్నర్లు రంగంలోకి దిగితే మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.