ENG vs NZ WC 2023: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో నేడు మొదటి మ్యాచ్‌ జరుగుతోంది. అహ్మదాబాద్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ సారథి టామ్‌ లేథమ్ మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. గాయం కారణంగా కేన్‌ విలియమ్సన్‌ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దాంతో నాయకత్వ బాధ్యతలు అతడిపై పడ్డాయి.


టామ్‌ లేథమ్, కివీస్‌ సారథి: మేం మొదట బౌలింగ్‌ చేస్తాం. పిచ్‌ చూస్తుంటే బాగుంది. సమయం గడిచే కొద్దీ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మా సన్నద్ధత బాగా సాగింది. ఈ ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి క్రికెటర్లు వారం క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. దురదృష్టవశాత్తు కేన్‌ విలియమ్సన్‌ ఇంకా సిద్ధమవ్వలేదు. లాకీ ఫెర్గూసన్‌కు చిన్న గాయమైంది. సోధి, సౌథీ ఆడటం లేదు.


జోస్‌ బట్లర్‌, ఇంగ్లాండ్‌ సారథి: మేమూ మొదట బౌలింగే ఎంచుకొనేవాళ్లం. వికెట్‌ చాలా బాగుంది. మా సన్నద్ధత పర్వాలేదు. న్యూజిలాండ్‌పై అద్భుత సిరీస్‌ ఆడాం. నాలుగేళ్ల క్రితం మేం వన్డే ప్రపంచకప్‌ గెలిచినందుకు గర్వపడుతున్నాం. బెన్‌ స్టోక్స్‌ ఈ మ్యాచ్‌ ఆడడు. అతడి పిరుదుల్లో గాయమైంది. అట్కిన్‌సన్‌, టాప్లే, విల్లే, స్టోక్స్‌ ఈ మ్యాచ్‌ ఆడటం లేదు.


ఇంగ్లాండ్‌: జానీ బెయిర్‌ స్టో, డేవిడ్‌ మలన్‌, హ్యారీ బ్రూక్‌, జోస్‌ బట్లర్‌, లియామ్‌ లివింగ్‌స్టన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌వుడ్‌


న్యూజిలాండ్‌: డేవాన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, డరైల్‌ మిచెల్‌, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్‌, మార్క్‌ ఛాప్‌మన్‌, మిచెల్‌ శాంట్నర్‌, జేమ్స్‌ నీషమ్‌, మ్యాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌


ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సమయానికి ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కానుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అహ్మదాబాద్‌లో సూర్యరశ్మి ఉంటుంది. అలాగే గంటకు 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం జరిగే మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపదని భావిస్తున్నారు.


ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే మ్యాచ్ నుంచి భారత జట్టు తన ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8వ తేదీన చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత భారత జట్టు తన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది. ఇరు జట్లు అక్టోబర్ 11వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనున్నాయి.


అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ జట్లతో పాటు ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లతో భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీ ఫైనల్ నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.