ధర్మశాల: అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసింది. వర్షం కారణంగా సగం ఓవర్లకు కుదించిన మ్యాచులో ఓపెనర్ సెంచరీ చేసిన అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్‌ దూబే చెరో 3 వికెట్లు తీయగా.. తెలుగు తేజం నితీశ్ కుమార్‌ రెడ్డి 2 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

Continues below advertisement

నితీష్ చేసిన పనికి ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా..టీమిండియా ఆల్ రౌండర్ నితీశ్‌ కుమార్ రెడ్డి తొలి వన్డే అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడు. అంతలో ఒక్కసారిగా అతడి ఫోన్‌ రింగ్ అయింది. ఫోన్ స్క్రీన్ చూసిన నితీశ్ వెంటనే మాట్లాడటం ఆపేసి జర్నలిస్టులకు సారీ చెప్పాడు. అది తన తల్లి నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌ కావడంతో ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఫోన్ లిఫ్ట్‌ చేశాడు. అమ్మా.. నేను ఐదు నిమిషాలు ఆగి నీకు కాల్ చేస్తా అని సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత మళ్లీ ప్రెస్‌మీట్‌ను కొనసాగిస్తూ మరోసారి విలేకర్లకు సారీ చెప్పాడు. దాంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

నారా లోకేష్ ప్రశంసలు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై అటు నెటిజన్లతో పాటు ఇటు ప్రముఖుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సైతం ఈ వీడియోపై స్పందిస్తూ నితీశ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

"క్రికెట్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా ఎక్కడైనా ఫస్ట్ ప్రియారిటీ అమ్మకే.. వెల్ ప్లెయిడ్ నితీష్" అంటూ ఆయన X వేదికగా కామెంట్ చేశారు. ఎంత ఎదిగినా అమ్మకు ఇచ్చే గౌరవం తగ్గలేదంటూ క్రికెట్ అభిమానులు ఈ తెలుగు ఆల్ రౌండర్‌ను కొనియాడుతున్నారు.

Also Read: IND VS AFG 1st ODI Result: తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ! రాణించిన గిల్, బ్రార్, దూబే, గుర్బాజ్ మెరుపు సెంచరీ వృథా

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా ఈ తొలి వన్డే మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన అఫ్గాన్ జట్టు ఓపెనర్ గుర్బాజ్ మెరుపు శతకం సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారత్ త్వరగానే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (84 నాటౌట్), ఇషాన్ కిషన్ (34), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) రాణించడంతో 22.5 ఓవర్లలోనే టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బౌలర్లు రాణించగా, ఆపై బ్యాటర్లు దుమ్మురేపగా.. సమష్టి ప్రదర్శనతో భారత్ విజయంతో బోణీ కొట్టింది.