MS Dhoni's Mantra On Captaincy : టీమిండియా మాజీ సారధి, కెప్టెన్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni) యువకులకు మరోసారి హితోపదేశం చేశాడు. కేవలం ఒక ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని.. దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలని సూచించాడు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే సహచరుల నమ్మకం పొందగలమని దిశానిర్దేశం చేశాడు. డ్రెస్సింగ్‌ రూంలో సహచరులు, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే విధేయతతో ఉండరని ధోనీ కుండబద్దలు కొట్టాడు. కేవలం మాటలు చెబితే సరిపోదు. ఏదైనా చేతల్లోనే చూపించాలని స్పష్టం చేశాడు. మన కుర్చీ లేదా ర్యాంకు వల్ల గౌరవం వస్తుందని తాను భావించట్లేదని మహీ తెలిపాడు . గౌరవం దానంతట అదే రాదని దాన్ని మనమే సంపాదించుకోవాలని ధోని తెలిపాడు. ముంబైలో జరిగిన  ఓ కార్యక్రమంలో ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

Continues below advertisement



కొత్త లోగో బ్యాట్‌తో ధోనీ 
తాజాగా ధోనీ కొత్త లోగో ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. అది ఏ పెద్ద కంపెనీ లోగోనో కాదు. ఆ బ్యాటుపై ఉన్న స్టిక్కర్ ఏ కంపెనీది కాదు. ఆ స్టిక్కర్ మీద అత‌డి స్నేహితుడి షాపు పేరు రాసి ఉంది. బాల్యమిత్రుడికి సాయం చేయాల‌నే ఉద్దేశంతో ధోనీ తన ఫ్రెండ్‌ షాప్ పేరుతో ఉన్న‌ స్టిక్కర్ అతికించిన బ్యాటుతో మ‌హీ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ చిన్నప్పటి స్నేహితుడికి ‘ప్రైమ్ స్పోర్ట్స్' అనే క్రీడా పరికరాల దుకాణం ఉంది. ఇందులో క్రికెట్ కిట్తో పాటు జెర్సీలు, ఇత‌ర ఆట సామ‌గ్రి ల‌భిస్తాయి. దాంతో, త‌న మిత్రుడి దుకాణానికి మ‌రింత పాపులారిటీ తేవ‌డం కోసం ధోనీ.. ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ప్రాక్టీస్ చేశాడు. ఇంకేముంది.. క్షణాల్లో ఆ ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారాయి. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. త‌న కెరీర్‌లో చాలా కంపెనీల లోగో ఉన్న బ్యాట్‌లు ఉప‌యోగించాడు.  అత‌డు స్నేహితుల దుకాణం పేరున్న బ్యాటుతో క‌నిపించ‌డం మాత్రం ఇదే తొలిసారి. దాంతో, ప్రైమ్ స్పోర్ట్స్ బ్యాటుతో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు చూసిన‌వాళ్లంతా.. అందుకే ధోనీ ప్రత్యేకం అంటూ కామెంట్లు పెడుతున్నారు.


మహీ భాయ్‌ ప్రత్యేక పూజలు 
టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్‌ ధోని(MS Dhoni)... జార్ఖండ్‌(Jarkhand) రాంచీ(Ranchi)లోని పవిత్ర దేవరీ ఆలయాన్ని( Dewri Temple) సందర్శించాడు. అభిమానుల మధ్య క్యూ లైన్‌లో నిల్చొని అమ్మవారిని దర్శించుకున్నాడు. దేవరీ ఆలయంలోని దుర్గాదేవికి మహీ ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అభిమానులు ధోనీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చెన్నై కెప్టెన్ దేవరీ మా ఆలయంను సందర్శించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.దేవరీ ఆలయంలో ధోనీ ప్రత్యేక పూజలు చేయడం ఇదే తొలిసారి కాదు. కీలక టోర్నీలు, ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మహీ ఈ ఆలయాన్ని సందర్శించి దుర్గాదేవి దర్శనం చేసుకుంటాడు. భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి ధోనీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ టోర్నీలు, ఐపీఎల్‌కు ముందు ఈ ఆలయాన్ని సందర్శించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు.