Most Player of the Match awards in T20I: ఆసియా కప్ వచ్చే వారం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. ఈసారి ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. గతంలో 2016, 2022లో కూడా ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఆసియా కప్ కోసం 8 జట్లు తమ జట్లు, రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలు ప్రకటించాయి. ఆసియా కప్‌లో టీ20 ఫార్మాట్లో జరగనుండటం భారత్‌కు కలిసిరానుంది. టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న టాప్ 5 ఆటగాళ్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

T20Iలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్స్

టీ20 ఇంటర్నేషనల్‌లో ఇండియాదే హవా. భారత్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1గా ఉంది. టీ20లో భారత ఆటగాళ్ల ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. భారత ఆటగాళ్లకు చాలా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు వచ్చాయి. టీ20లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లలో టాప్ 5లో ఇద్దరు భారత బ్యాటర్ల పేర్లు ఉన్నాయి.

1 ) విరన్‌దీప్ సింగ్ (Virandeep Singh)

మలేషియా క్రికెటర్ విరన్‌దీప్ సింగ్ 102 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 22 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. టీ20Iలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న వారిలో ఈ ఆటగాడు అగ్రస్థానంలో ఉన్నాడు.

2 ) సికిందర్ రజా (Sikandar Raza)

జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికిందర్ రజా 2013 నుంచి టీ20ల్లో ఆడుతున్నాడు. సికందర్ రజా 110 మ్యాచ్‌లలో 17 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడు. దాంతో ఈ జాబితాలో సికిందర్ రజా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

3 ) సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ ను మిస్టర్ 360 ప్లేయర్ అని పిలుస్తారు. 2021లో SKY టీ20 ఇంటర్నేషనల్‌లోకి అడుగుపెట్టాడు. తక్కువ కాలంలోనే 83 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆసియా కప్‌లో భారత జట్టుకు సూర్య సారథిగా వ్యవహరించనున్నాడు. 

4 ) విరాట్ కోహ్లీ (Virat Kohli)

టీ20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న విరాట్ కోహ్లీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ 2010 నుంచి 2025 మధ్య మొత్తం 125 టీ20 లు ఆడగా కింగ్ కోహ్లీ 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సాధించాడు. ఎన్నో కీలక మ్యాచ్ లలో భారత్ కు విజయాలు అందించాడు. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో చివర్లో సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు కోహ్లీ.

5 ) మహ్మద్ నబీ (Mohammad Nabi)

అఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ ఆ దేశం తరఫున విలువైన బ్యాటర్. 135 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడగా నబీ 14 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. నబీ త్వరలో జరగనున్న ఆసియా కప్ 2025 కోసం అఫ్ఘనిస్తాన్ జట్టులో ఉన్నాడు.