Pacer Regains Rhythm Ahead Of New Season:  శ్రీలంక టూర్ సందర్భంగా తన బౌలింగ్ వేగం, రిథమ్ పడిపోవడంపై భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ పెదవి విప్పాడు. రెండు నెలల పాటు ఆటకు పూర్తిగా దూరంగా ఉండటం వల్లే క్రీజులో ఇబ్బంది పడ్డానని, అయితే దులీప్ ట్రోఫీ ఫైనల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయడం ద్వారా తిరిగి పాత లయను అందుకున్నానని తెలిపాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ సాధారణంగా వేసే 140 కిలోమీటర్ల వేగానికి బదులు కేవలం 120ల వేగంతోనే బంతులు విసిరాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 44 ఓవర్లు వేసినప్పటికీ బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు. దీనిపై దులీప్ ట్రోఫీ ఫైనల్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ, "రెండు నెలల సుదీర్ఘ బ్రేక్ తర్వాత నేరుగా మ్యాచ్‌లోకి అడుగుపెట్టడంతో నా రిథమ్ దెబ్బతింది. నేను పూర్తిగా రిథమ్‌పై ఆధారపడే బౌలర్‌ని. శరీర కదలికలు సమన్వయంలో లేకపోతే క్రీజులో వేగం చూపించలేను. నా రన్‌అప్‌లో కొన్ని అడుగులు చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా పడటంతో ఫ్లో మిస్సయి పేస్ తగ్గింది" అని వివరించాడు.

Continues below advertisement

Read Also: Gavaskar Slams BCCI: ప్రీమియర్ టోర్నీకి ఇచ్చే విలువిదేనా..? రంజీ ట్రోఫీ షెడ్యూల్ మార్పులపై  గవాస్కర్ ఫైర్

చెన్నై ఎండల్లో 41 ఓవర్లు.. తిరిగి ట్రాక్‌లోకి రన్‌అప్జూన్ 8న అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ ముగిసిన తర్వాత రెండు నెలల విశ్రాంతి తీసుకుని ఆగస్టు 7న శ్రీలంక పర్యటనకు సిరాజ్ వెళ్లాడు. అయితే చేపాక్‌లో ఈస్ట్ జోన్‌తో జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ తరఫున 41 ఓవర్ల పాటు బౌలింగ్ చేయడం ద్వారా రాబోయే కఠినమైన సీజన్‌కు తన శరీరం పూర్తిగా సిద్ధమైందని సిరాజ్ భావిస్తున్నాడు. "ఇక్కడ అంతా దారికొచ్చింది, దాంతో సహజంగానే పేస్ పెరిగింది. కొలంబో టెస్ట్ తర్వాత కేవలం వారం రోజుల్లోనే చెన్నైకి వచ్చి భానుడి ప్రతాపంలో బౌలింగ్ చేయడం చాలా కష్టమనిపించింది. కానీ దేశానికి ఆడుతున్నప్పుడు ఎలాంటి సాకులు చెప్పకూడదు. మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్లు రాకపోయినా, పడిన కష్టం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తప్పక ఫలితాన్ని ఇస్తుంది. నా పదేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ రెండు నెలల బ్రేక్ తీసుకోలేదు. నా శరీరం ఎక్కువ ఓవర్లు వేస్తేనే మెరుగ్గా స్పందిస్తుంది" అని అన్నాడు.

Continues below advertisement

Read Also: Delhi T20 Match: ఆఫ్గాన్ తో తొలి టీ20కి వాయిదా ముప్పు..! పోలీస్ రిక్వెస్ట్ తర్వాత ఈ మ్యాచ్ పై కీలక ప్రకటన

తోడుగా నిలిచిన మహమ్మద్ షమీ.. అమూల్యమైన సూచనలుఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి ఈస్ట్ జోన్ తరఫున ఆడిన తన పాత భాగస్వామి మహమ్మద్ షమీతో సిరాజ్ కాసేపు మాట్లాడాడు. ఈ సంభాషణ గురించి షమీ స్పందిస్తూ, "మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ తన సహజమైన రిథమ్ కోసం ఇబ్బంది పడ్డాడు. మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే నీ సహజమైన బలాలపై మాత్రమే దృష్టి పెట్టాలని అతడికి గుర్తుచేశాను. రన్‌అప్, రిథమ్ సరిగ్గా కుదిరితే లైన్ అండ్ లెంగ్త్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి" అని తెలిపాడు. సీనియర్ బౌలర్ ఇచ్చిన సలహాలు సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బౌలింగ్ చేయడానికి తోడ్పడ్డాయి.

న్యూజిలాండ్ సిరీస్‌పై గురి.. టీమ్ ఇండియాకు భారీ ఊరటపూర్తి ఫిట్‌నెస్‌తో పాటు రన్‌అప్ గాడిన పడటంతో రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో సిరాజ్ మునుపటి వాడివేడి బంతులతో చెలరేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ సిరాజ్.. ఎక్కువగా అంత‌ర్జాతీయ టెస్టులు మాత్ర‌మే ఆడుతున్నాడు.