దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024)లో సంచలన విజయం నమోదైంది. తేలిగ్గా గెలుస్తుందనుకున్న జట్టు అనూహ్య రీతిలో పరాజయం పాలవ్వగా....గెలుపు ఆశలే లేని జట్టు సంచలన విజయం నమోదు చేసి అద్భుతం చేసింది.  అహ్మదాబాద్ వేదికగా కర్ణాటక-గుజరాత్‌(Karnataka Vs Gujarat) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 110 పరగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక కర్ణాటక ఆరు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓ దశలో 50 పరుగలకు ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా గెలుపు దిశగా పయనించిన కర్ణాటక... 60 పరుగుల వ్యవధిలో 10 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.


గుజరాత్‌ అద్భుతం చేసిందిలా...
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులు చేసింది. క్షితిజ్ పటేల్ 95 పరుగులు, ఉమాంగ్ కుమార్ 72 పరుగులతో రాణించారు. కర్ణాటక బౌలర్లలో కౌశిక్ 4 వికెట్లు తీశాడు. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 109, మనీష్ పాండే 88 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో చింతన్ గజా 3 వికెట్లు తీయగా.. రింకేష్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటకకు 110 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో మనన్ హింగ్రాజియా, ఉమాంగ్ కుమార్ హాఫ్ సెంచరీలు చేయడంతో.. గుజరాత్ 219 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో కర్ణాటక ముందు 110 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. స్వల్ప లక్ష్యం కావడంతో మయాంక్ అగర్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, మనీష్ పాండే స్టార్ బ్యాటర్లతో కూడిన కర్ణాటక జట్టు తేలిగ్గా గెలుస్తుందని అంతా అనుకున్నారు,  ఓపెనర్లు మయాంక్, పడిక్కల్ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. ఇక కర్ణాటక గెలుపు ఖాయమనుకున్న దశలో గుజరాత్‌ బౌలర్లు అద్భుతం చేశారు. గుజరాత్ బౌలర్ సిద్ధార్థ్ దేశాయ్ ధాటికి కర్ణాటక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మయాంక్‌ అగర్వాల్‌ను అవుట్‌ చేసి కర్ణాటక పతానాన్ని ప్రారంభించిన సిద్ధార్థ్‌... ఆ తర్వాత వరుసగా వికెట్లు తీసి కర్ణాటక పతనాన్ని శాసించాడు. సిద్దార్థ్ మొత్తంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ రింకేష్ 3 వికెట్లు తీశాడు. వీరిద్దరి దెబ్బకు కర్ణాటక సైకిల్ స్టాండ్‌‌లా కుప్పకూలింది. ఊహించని రీతిలో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన కర్ణాటక.... మరో 53 పరుగులకు ఆలౌటైంది. విజయానికి కేవలం 6 పరుగుల దూరంలో ఆలౌటై ఊహించని ఓటమిని మూటగట్టుకుంది.


చివరి వికెట్‌కు కౌశిక్ (4 నాటౌట్), ప్రసిద్ధ్ కృష్ణ (10 బంతుల్లో 7) గెలిపిస్తారేమోనని అనుకున్నా ప్రసిద్ధ్‌ను రింకేష్ ఔట్ చేయడంతో కర్ణాటక విజయానికి ఆరు పరుగుల దూరంలోనే ఆగిపోయింది. 


రంజీలు ఆడమన్నారు..  ఆడేశా...
తనకు ఏ ప‌నినైతే అప్పగించారో అది విజ‌య‌వంతంగా పూర్తి చేశానని.. తనను రంజీ మ్యాచ్‌ ఆడమన్నారని... ఆడాను తన ప్రణాళికలు అమలు చేశానని అయ్యర్‌ తెలిపాడు. రంజీ ట్రోఫీలో తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని... కొన్ని విష‌యాలు మ‌న ఆధీనంలో ఉండ‌వని... అలాంటి వాటి గురించి ఆలోచించ‌క‌పోవ‌డ‌మే మంచిదని అయ్యర్‌ అన్నాడు. రంజీ మ్యాచ్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ ల‌భించిందని తెలిపాడు.