Manav Suthar Makes Historic Dream Test Debut: ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ ఏకైక‌ టెస్ట్ మ్యాచ్ సెకండ్ డే ఆటలో ఒక వండర్‌ఫుల్ సీన్ కనిపించింది. టీమిండియా యంగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ డెబ్యూ మ్యాచ్ లోనే అద్భుతమైన ఇంపాక్ట్ చూపించాడు. న్యూ చండీగఢ్ లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీ టైమ్ కంటే జస్ట్ ముందే బాల్ ను సుతార్ కు ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన ఈ 23 ఏళ్ల యంగ్ ప్లేయర్ కేవలం నాలుగు బాల్స్ లోనే తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.

Continues below advertisement

 

ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ .. 

మానవ్ సుతార్ వేసిన ఫస్ట్ ఓవర్ ఫోర్త్ బాల్ కు అఫ్గాన్ ఓపెనర్ అబ్దుల్ మాలిక్ స్వీప్ షాట్ కొట్టడానికి ట్రై చేశాడు. అయితే బాల్ టాప్ ఎడ్జ్ అయి గాల్లోకి లేవగా, బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి మొహమ్మద్ సిరాజ్ ముందుకు డైవ్ చేస్తూ ఒక షార్ప్ క్యాచ్ ను అందుకున్నాడు. ఈ వికెట్ పడగానే టీమిండియా ప్లేయర్స్ అందరూ సుతార్ ను హగ్ చేసుకుంటూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సాలిడ్ బ్రేక్‌థ్రూతో సుతార్ తన కెరీర్ లోనే మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ ను సొంతం చేసుకున్నాడు.

Read Also: Ind Declared VS AFG: భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు

పాతికేళ్ల రికార్డు బ్రేక్.. 

ఇండియా టెస్ట్ క్రికెట్ హిస్టరీలో డెబ్యూ మ్యాచ్ లోనే ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీసిన ఎనిమిదో ఇండియన్ క్రికెటర్ గా మానవ్ సుతార్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. దాదాపు 8 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ అరుదైన క్లబ్ లో ఇంతకుముందు మొంటు బెనర్జీ (1948), మనోహర్ హార్డికర్ (1958), వామన్ కుమార్ (1961), చేతన్ శర్మ (1984), డబ్ల్యూవీ రామన్ (1988), నిలేష్ కుల్కర్ణి (1997), టిను యోహానన్ (2001) మాత్రమే ఉన్నారు. 2001 లో ఇంగ్లాండ్ పై టిను యోహానన్ ఈ ఫీట్ సాధించిన తర్వాత మళ్లీ 25 ఏళ్ల వరకు ఏ ఇండియన్ బౌలర్ కూడా ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీయలేదు. ఆ రికార్డును సుతార్ ఇప్పుడు రిపీట్ చేశాడు. స్పిన్ ఆల్ రౌండర్ హర్ష్ దూబేను పక్కన పెట్టి మానవ్ సుతార్ ను టీమ్ లోకి తీసుకోవడం పర్ఫెక్ట్ డెసిషన్ అని సుతార్ నిరూపించాడు. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందు సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా సుతార్ టెస్ట్ క్యాప్ నంబర్ 319 ను అందుకున్నాడు. 2021 లో అక్షర్ పటేల్ డెబ్యూ చేసిన తర్వాత టీమిండియా తరఫున టెస్ట్ ఫార్మాట్ లో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ స్పెషలిస్ట్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా మానవ్ సుతార్ నిలిచాడు.

ఆఫ్గాన్ ఎదురీత‌..

ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్గానిస్థాన్ ఎదురీదుతోంది. ఆదివారం రెండోరోజు ఆట‌ముగిసే స‌రికి 39.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 113 ప‌రుగులు చేసింది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ ర‌హ్మ‌త్ షా (43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మాన‌వ్ సుతార్ కు మూడు, ప్ర‌సిధ్ కృష్ణ‌కు రెండు వికెట్లు ద‌క్కాయి. అంత‌కుముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 368/3 తో ఆట కొనసాగించిన భార‌త్, ఎనిమిది వికెట్ల‌కు 564 ప‌రుగుల వ‌ద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. శుభ‌మాన్ గిల్ (126) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. స‌లీమ్ కు ఆరు వికెట్లు ద‌క్కాయి.