MS Dhoni: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. మేలో ముగిసిన ఐపీఎల్-16 తర్వాత  మోకాలి గాయానికి శస్త్ర చికిత్స  చేయించుకున్న మహేంద్రుడు.. అమెరికా పర్యటనలో భాగంగా బెడ్‌మినిస్టర్‌లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మాజీ యూఎస్ ప్రెసిడెంట్‌ను కలిశాడు.  ట్రంప్ ఆహ్వానం మేరకే  ధోని ఇక్కడికి వెళ్లినట్టు సమాచారం.  ధోని - ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  


తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో కనిపించిన ధోని ఆ తర్వాత  తాజాగా మీడియాలో కనిపించడం ఇదే తొలిసారి. అమెరికా పర్యటనలో ఉన్న ధోని..  యూఎస్ ఓపెన్ పోటీలను కూడా వీక్షించాడు. గురువారం  స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ -  జర్మనీ ఆటగాడు  అలగ్జాండర్ జ్వెరెవ్‌ల మ్యాచ్‌ను తిలకించిన ధోని ఆ తర్వాత  ట్రంప్ ‌తో కలిసి గోల్ఫ్ ఆడటం విశేషం. 


 






 






ధోనితో పాటు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మిత్రుడు  సంగ్వీ తన  ఇన్‌స్టా ఖాతాలో  ధోని - ట్రంప్‌‌లు గోల్ఫ్ ఆడిన ఫోటోలు, వీడియోలను షేర్ చేశాడు. ధోని యూఎస్ ఓపెన్ మ్యాచ్‌ను కూడా సంగ్వీతో కలిసి చూశాడు. ఈ ఏడాది  ఏప్రిల్ - మే లో జరిగిన ఐపీఎల్ - 16లో ధోని కాలికి గాయమైనా  సీజన్ మొత్తం గాయంతోనే బరిలోకి దిగాడు.  మే 29న మొదలై  వర్షం కారణంగా మూడు రోజుల పాటు సాగిన  ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ధోని సేన.. చెన్నైకి ఐదో ఐపీఎల్ ట్రోఫీని అందించింది.  ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే ధోని..  మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.  ఐపీఎల్ - 2024లో కూడా ఆడేందుకు ధోని  ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. 


 






 






 



































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial