VVS Laxman To Replace Ajith Agarkar Soon As Cheif Selector:  బిసిసిఐ సెలెక్షన్ కమిటీ చీఫ్ గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం మరో నెల రోజుల్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ ను కొత్త చీఫ్ సెలెక్టర్ గా నియమించేందుకు బోర్డ్ టాప్ బాసెస్ ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అగార్కర్ కాంట్రాక్ట్ జూన్ 2026 నాటికే పూర్తయినా బిసిసిఐ మూడు నెలల ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతడు కంటిన్యూ అవుతాడని భావించినా, రోహిత్ శర్మ ఫ్యూచర్ చుట్టూ నడిచిన డ్రామా వల్ల సిట్యుయేషన్ కాంప్లెక్స్ గా మారింది.

Continues below advertisement

Continues below advertisement

రోహిత్ శర్మ సెంచరీ ట్విస్ట్.. అగార్కర్ ప్లాన్స్ రివర్స్ఇంగ్లాండ్‌తో జరిగిన 3-వన్డేల సిరీస్ రోహిత్ శర్మకి లాస్ట్ సిరీస్ అని ప్రచారం జరిగింది. గౌతమ్ గంభీర్ లీడ్ లోని మేనేజ్‌మెంట్‌తో చర్చించి రోహిత్‌ను తదుపరి మ్యాచ్ ల నుంచి పక్కన పెట్టాలని అగార్కర్ ప్యానెల్ భావించింది. అయితే లార్డ్స్ లో జరిగిన థర్డ్ వన్డేలో రోహిత్ మైండ్ బ్లాకింగ్ సెంచరీ బాదడంతో సీన్ రివర్స్ అయింది. దాంతో సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ డిఫెన్స్ లో పడిపోయారు.

దేవజిత్ సైకియా షాకింగ్ స్టేట్‌మెంట్.. ప్రెజెంట్ ప్లాన్స్ లో హిట్ మ్యాన్లీక్ బయటకు వచ్చిన వెంటనే బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటన రిలీజ్ చేశారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌తో చర్చించకుండానే సైకియా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చార‌ని టాక్ నడిచింది. "రోహిత్ శర్మ ఇండియా వన్డే టీమ్ లో రెగ్యులర్ మెంబర్. టీమ్ ప్లాన్స్ లో ఉన్నంత వరకు అతడు ఇండియా తరఫున ఆడుతూనే ఉంటాడు. లార్డ్స్ వన్డే అతనికి లాస్ట్ మ్యాచ్ కాదు" అని సైకియా  స్పష్టం చేశారు. మరోవైపు 2027 వరల్డ్ కప్ లో రోహిత్ ఆడటం మేనేజ్‌మెంట్ కి ఇష్టం లేదని కూడా సమాచారం.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఓటములపై రివ్యూ డిలే.. శ్రీలంకకు వెళ్లిన టీమ్ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఆడిన 10 మ్యాచుల్లో 8 ఓటములు ఎదురవ్వడంపై బిసిసిఐ రివ్యూ మీటింగ్ ప్లాన్ చేసింది. ఇంగ్లాండ్ టూర్ పూర్తయ్యాక ఈ సమావేశం జరగాల్సి ఉన్నా, అది జరగకుండానే టీమ్ శ్రీలంకకు టెస్ట్ సిరీస్ కోసం ట్రావెల్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అగార్కర్ స్థానంలో లక్ష్మణ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.