KS Bharat Announces Retirement From  Cricket:  ఇండియా క్రికెట్ లో ఒక ముగింపు పడింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన డెసిషన్ ను షేర్ చేస్తూ ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తన లైఫ్ లోనే బిగ్గెస్ట్ గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ జర్నీ ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, టెస్ట్ మ్యాచ్ లలో దేశం తరఫున ఆడటం ప్రతి క్షణం గర్వంగా అనిపించిందని ఎమోషనల్ అయ్యాడు. గత రెండు దశాబ్దాలుగా తన ఫ్యామిలీ మొత్తం ఒకే కల కోసం బతికిందని, తనను ఎంతో డిసిప్లిన్ గా పెంచిన పేరెంట్స్, సిస్టర్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు.

Continues below advertisement

Read Also: RCB Postpone Title Celebrations: ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!

టెస్ట్ కెరీర్ లో ఏడు మ్యాచ్ లు.. 

Continues below advertisement

భరత్ ఇండియా తరఫున మొత్తం 7 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 20.09 యావరేజ్ తో 221 రన్స్ చేశాడు. అతడి బెస్ట్ స్కోరు 44 రన్స్. ఒక వికెట్ కీపర్ గా టెస్టుల్లో 21 క్యాచ్ లు అందుకోవడంతో పాటు ఒక స్టంపింగ్ కూడా చేశాడు. తన కెరీర్ లో సపోర్ట్ చేసినందుకు బీసీసీఐ, కోచ్ లు, మేనేజర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. తన చిన్నతనం నుంచి ఎంతగానో ఎంకరేజ్ చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీడీసీఏ (VDCA) ఆఫీస్ బేరర్లను గుర్తు చేసుకున్నాడు. అలాగే తనకు ఎల్లప్పుడూ బెస్ట్ పిచ్ లు, గ్రౌండ్ కండిషన్స్ అందించిన గ్రౌండ్ స్టాఫ్ కు, తోటి ప్లేయర్లకు థాంక్స్ చెప్పాడు.

Read Also: Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు

ఐపీఎల్ లో కోహ్లీ ఇచ్చిన ఛాన్స్.. 

తన కెరీర్ లో ఐపీఎల్ డెబ్యూ కెప్టెన్ విరాట్ కోహ్లీ రోల్ ను భరత్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడే అవకాశం ఇచ్చి తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి హెల్ప్ చేసినందుకు కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సీజన్ లో 8 మ్యాచుల్లో 191 రన్స్ చేశాడు. తన టెస్ట్ డెబ్యూ కెప్టెన్ రోహిత్ శర్మ లీడర్ షిప్ ను ప్రశంసిస్తూ ఆ మూమెంట్ ప్రైస్ లెస్ అని అన్నాడు. ఇండియా ఏ టీమ్ నుంచి సీనియర్ టీమ్ వరకు గైడెన్స్ ఇచ్చిన కోచ్ రాహుల్ ద్రవిడ్ సర్ సపోర్ట్ ను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు.

యంగ్ ప్లేయర్లకు అదిరిపోయే టిప్స్.. 

తన చిన్ననాటి కోచ్ జె కృష్ణారావుకు కూడా భరత్ థాంక్స్ చెప్పాడు. గ్రౌండ్ లో నేషనల్ యాంథమ్ విన్నప్పుడు కలిగిన ఫీలింగ్ లైఫ్ లాంగ్ గుర్తుంటుందని అన్నాడు. యంగ్ ప్లేయర్స్ పెద్ద కలలు కనాలని, క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడితే కలలు నిజమవుతాయని అడ్వైజ్ ఇచ్చాడు. బీసీసీఐ, టెస్ట్ క్రికెట్ తో జర్నీ ఎండ్ అయినా గేమ్ తో తన రిలేషన్ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశాడు. ఫ్యూచర్ లో నెక్స్ట్ జనరేషన్ క్రికెటర్లకు గైడ్ గా, మెంటర్ గా, కోచ్ గా ఉంటూ క్రికెట్ కు తన వంతు కాంట్రిబ్యూషన్ అందిస్తానని భరత్ తన పోస్ట్ లో ముగించాడు.