Rohit Sharma on Virat Kohli: ఎన్నో అంచనాలు... మరెన్నో లెక్కలు... అభిమానుల ఎదురుచూపులు.. వీటన్నింటినీ మోస్తూ సెమీఫైనల్(Semi Final)లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. నాకౌట్ మ్యాచుల్లో తిరుగులేని రికార్డు ఉన్న కింగ్..ఈసారి మాత్రం ఆ ఊపు కొనసాగించలేకపోయాడు. ఈ మెగా టోర్నీలో మిగిలిన బ్యాటర్లు అందరూ ఏదో ఒక సందర్భంలో రాణించారు. జట్టు ఆపదలో ఉన్నప్పుడు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కానీ విరాట్ ఒక్కడే ఇంకా ఆ ఊపు అందుకోలేదు. కీలకమైన ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచులోనూ విరాట్ 9పరుగులకే అవుట్ అయ్యాడు. అసలే ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్‌లో స్టార్ బ్యాటర్ వరుసగా ఏడు మ్యాచుల్లో విఫలం కావడంపై కోహ్లీలో కూడా ఆ ఆందోళన కనిపించింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో 9 బంతుల్లో 9 పరుగులే చేసి అవుటైన తర్వాత కోహ్లీ కాస్త విషాదంగా కనిపించాడు. ఆ సమయంలోనే కోచ్, కెప్టెన్ కోహ్లీకి అండగా నిలిచారు. బ్రో మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. మ్యాచ్ పూర్తయ్యాక కోహ్లీపై రోహిత్(Rohit) చేసిన కామెంట్లయితే విరాట్‌పై జట్టుకు ఉన్న నమ్మకానికి ప్రతీకగా నిలిచాయి.
Rohit Sharma: శక్తి చాలా ఉంది... దాచి ఉంచాం... అవసరమైనప్పుడు ఆడతాం: కోహ్లీపై రోహిత్ కామెంట్స్
Jyotsna | 28 Jun 2024 11:03 AM (IST)
Ind vs Eng Highlights: ఈ టీ 20 వరల్డ్ కప్ లో ఇప్పటికీ వరకు మెరిపించని విరాట్ కొహ్లీ సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్లో అయినా గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చి వరల్డ్ కప్ టీమిండియాకు అందివ్వాలని అందరికీ ఆశ.
కోహ్లీ ఫైనల్స్ లో అదరగొడతాడన్న హిట్‌మ్యాన్(Photo Source: Twitter/@ICC )
ఇక కామెంట్రీ బాక్స్‌లు బద్దలవ్వాల్సిందే
విరాట్ లాంటి బ్యాటర్ వరుస వైఫల్యాలతో సతమతం అవుతుండడం ఇది వరకు ఎన్నడూ లేదు. ఈ వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో 5సింగిల్ డిజిట్లకే పరిమితం అయ్యాడు. రెండు సార్లు డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అవుటై డ్రెస్సింగ్ రూంలో కూర్చొని ముభావంగా ఉన్నాడు. ఆ సమయంలో విరాట్ కొహ్లీ దగ్గరకి కోచ్ రాహుల్ ద్రవిడ్ వచ్చి సముదాయించాడు. కోహ్లీ లాంటి ఆటగాడికి ఇలా జరగడం చాలా అరుదు. కోహ్లీ లాంటి ఆటగాడు ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్‌లో రాణించలేకపోవటం అతనికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కెప్టెన్‌గా రోహిత్‌కు కూడా ఇది కొంచెం సంకట పరిస్థితినే కల్పిస్తుంది. అయితే ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో రోహిత్ శర్మ... విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కెప్టెన్‌గా కోహ్లీ అంటే రోహిత్‌కు ఎంత నమ్మకమో ఈ వ్యాఖ్యలతో మరోసారి నిరూపితమైంది.
రోహిత్ ఏమన్నాడంటే...
ఇంగ్లండ్‌పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టిన తర్వాత విరాట్ కొహ్లీ గురించి రోహిత్ మాట్లాడాడు. కోహ్లీ బలం ఏంటో ప్రపంచానికి కొత్తగా చెప్పక్కర్లేదని హిట్‌మ్యాన్ అన్నాడు. టీమిండియాకు ప్రపంచకప్ అందించేందుకు ఫైనల్ బాగా ఆడడం కోసం తన శక్తినంతా కోహ్లీ దాచుకుంటున్నాడేమో అని రోహిత్ అన్నాడు. కోహ్లీ ఒక్కసారి క్రీజులో నిలబడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనేలా రోహిత్ కామెంట్లు ఉండడంతో అభిమానులు నిజమే అని కామెంట్లు చేస్తున్నారు. కింగ్ ఒక్కసారి వేటకు దిగితే ప్రత్యర్థి బౌలర్లు బలి కావల్సిందేనని గుర్తు చేస్తున్నారు. విరాట్ కొహ్లీ సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్లో అయినా మరోసారి బ్యాట్ ఝుళిపించి వరల్డ్ కప్ టీమిండియాకు అందివ్వాలని కోరుకుంటున్నారు.
Published at: 28 Jun 2024 11:03 AM (IST)