Kieron Pollard In Anant Ambani Radhika Merchants pre wedding Event: రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani), నీతా అంబానీ(Neeta Ambani)ల కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani) ప్రీ వెడ్డిండగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి దేశ విదేశాల్లోని అతిథులు తరలివచ్చారు. పారిశ్రామికవేత్తలు, సెలబ్రెటీలు, క్రీడాకారులు, చాలా మంది ప్రముఖులు ఈ వేడకలకు హాజరయ్యారు. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనేక మంది విదేశీ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి మధ్యలో వచ్చి ఈ వేడుకలకు హాజరయ్యాడు. ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా పీఎస్‌ఎల్ 2024 టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో కీరన్ పొలార్డ్ కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు
వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ముంబై ఇండియ్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ యజమాని ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ -వెడ్డింగ్ (Anant Ambani Pre-Wedding) వేడుకకు మాజీ ఆటగాళ్లంతా తరలివెళ్ళారు. మాజీ సారథి ఎంఎస్ ధోనీ(MS Dhoni), సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)లు కుటుంబంతో కలిసి పెండ్లి కార్యక్రమాలలో పాల్గొన్నారు. శుక్రవారం ముంబై విమానాశ్రయంలో మహీ, సచిన్‌లు కుటుంబ సమేతంగా కనిపించగానే కెమెరాలు క్లిక్ మనిపించారు. అలాగే మాజీ పేసర్ జహీర్ ఖాన్, పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు.
రాధిక మర్చంట్ కూడా సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయే. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్‌ల చిన్న కుమార్తె. అయితే, అనంత్, రాధిక కలిసి చదువుకోలేదు. వీరంతా సంపన్నులు కావడం వల్ల ఒకరి ఫంక్షన్స్‌కు మరొకరు హాజరయ్యేవారు. వారి సర్కిల్స్‌లో జరిగే వేడుకల్లో బిలినియర్ల పిల్లలంతా కలిసేవారు. అలా రాధిక, అనంత్ మధ్య స్నేహం కుదిరింది. అప్పటి నుంచి రాధిక.. అంబానీ ఫ్యామిలీకి దగ్గరయ్యింది. వారి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో రాధిక మర్చంట్ ఉండాల్సిందే. చివరికి ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లిలో కూడా సందడంతా రాధికాదే. పెళ్లి వేడుకలో ఇషా చేయి పట్టుకుని నడవడంతో అంతా.. ఎవరా అమ్మాయి అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆమె అనంత్ గర్ల్‌ఫ్రెండ్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.