Kapil Dev Responds To Yograj Singh: ఇండియా గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ చిన్ననాటి స్నేహితులు. ఒకే కోచ్ దేశ్ ప్రేమ్ ఆజాద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఈ ఇద్దరూ ఇండియా టీమ్ కు ఆడారు. అయితే కపిల్ వరల్డ్ క్లాస్ లెజెండ్ అవ్వగా, యోగ్‌రాజ్ కెరీర్ కేవలం ఒక టెస్ట్, ఆరు వన్డేలకే పరిమితమైంది. తన కెరీర్ నాశనం అవ్వడానికి కపిల్ దేవే రీజన్ అంటూ యోగ్‌రాజ్ సింగ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు. కపిల్ కెప్టెన్ అయ్యాక తనను కావాలనే టీమ్ నుంచి తీసేశాడని ఆరోపించాడు. ఆ కోపంతో తాను పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డానని చెప్పడం క్రికెట్ హిస్టరీలో పెద్ద షాక్ ఇచ్చింది. ఈ మ్యాటర్ పై కపిల్ దేవ్ ఫస్ట్ టైమ్ ఓపెన్ అయ్యాడు.

Continues below advertisement

Read Also: ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్

పిస్టల్ తో ఇంటికి వెళ్లా.. యోగ్‌రాజ్ పాత కామెంట్స్ వైరల్గతంలో యోగ్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ.. తన భార్య ఫోర్స్ చేయడం వల్ల తాను కపిల్ ను నిలదీయడానికి డిసైడ్ అయ్యానని అన్నాడు. "వాడికి బుద్ధి చెప్తానని నా పిస్టల్ తీసుకుని సెక్టార్ 9 లోని కపిల్ ఇంటికి వెళ్లా. అతను తన తల్లితో కలిసి బయటకు వచ్చాడు. నేను అతన్ని దారుణంగా తిట్టా. నీ వల్లే నా ఫ్రెండ్ ను కోల్పోయా, నువ్వు చేసిన తప్పుకు అనుభవిస్తావ్ అని వార్నింగ్ ఇచ్చా" అని యోగ్‌రాజ్ ఓపెన్ గా చెప్పాడు. ఈ క్రేజీ ఇన్సిడెంట్ తర్వాత యోగ్‌రాజ్ కొడుకు, ఇండియా వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో కపిల్ దేవ్‌కు పర్సనల్ గా క్షమాపణలు కూడా చెప్పాడు.

Continues below advertisement

Read Also: Dada Sourav Ganguly Comments: గంగూలీ 54వ బర్త్‌డే వేళ టీమిండియా ఓటమిపై సంచలన కామెంట్స్.. సంజూ శాంసన్ వివాదంపై 'దాదా' సేఫ్ గేమ్, రాజ్ కుమార్ రావు 'బయోపిక్' పోస్టర్ లాంచ్!

యువి క్షమాపణలు అవసరం లేదు.. ఈ వివాదంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. యువరాజ్ తనకు సారీ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదని అన్నాడు. "యువరాజ్ గ్రేట్ క్రికెటర్, ఇండియాకు అతను చేసిన సేవలు అద్భుతం. క్రికెట్ ను అతను మరింత పాపులర్ చేశాడు, ఫ్యాన్స్ అతన్ని ఫుల్ గా లవ్ చేస్తారు" అని కపిల్ ప్రశంసించాడు. ఇక యోగ్‌రాజ్ కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ.. "అతనేం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థ: కావడం లేదు. నా వైపు నుంచి ఇప్పటికీ స్నేహమే ఉంది. కాకపోతే నా లైఫ్ లో ఎప్పుడూ  నెగెటివ్ గా, అశాంతితో ఉండే వ్యక్తులను కలవడానికి నేను ఇష్టపడను. ఎప్పుడూ హ్యాపీగా ఉండే వాళ్లనే కలుస్తా" అని కపిల్ క్లియర్ గా చెప్పాడు.

జీవితంలో ముందుకు సాగాలి.. పాత జ్ఞాపకాలే ముఖ్యంమనుషులు నెగెటివిటీతో ఉంటే సమాజం వారిని ప్రేమించదని కపిల్ అన్నాడు. "యోగ్‌రాజ్ కొడుకు యువరాజ్ అంత ఎత్తుకు ఎదిగాడు, అతను లైఫ్ లో హ్యాపీగా ఉండాలి. అందరికీ అన్నీ దొరకవు, కొన్నిసార్లు మనకు దొరుకుతాయి, కొన్నిసార్లు ఫ్యామిలీకి వస్తాయి. రోజు చివర్లో మనం సంతోషంగా ఉండటం ముఖ్యం. ఒకరిని కొట్టడం వల్ల, తిట్టడం వల్ల ఏం వస్తుంది? జీవితంలో ముందుకు సాగిపోవాలి. యోగ్‌రాజ్ లైఫ్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు, ఇండియాకు ఆడాడు, సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. చాలా మంది కంటే అతనికి ఎక్కువే దొరికింది, అయినా హ్యాపీగా లేకపోతే ఎవరూ ఏం చేయలేరు" అని కపిల్ అన్నాడు. చిన్ననాటి స్నేహితుడితో గడిపిన మంచి రోజులు మాత్రమే గుర్తుంచుకుంటానని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు.