Jemimah Rodrigues Hugs Fatima Sana Viral Video: ద హండ్రెడ్ లీగ్ పోరులో సదరన్ బ్రేవ్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ టీమ్‌ల మ్యాచ్ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇండియా ఉమెన్స్ క్రికెట్ స్టార్ జెమిమా రోడ్రిగ్స్, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఫాతిమా సనా మ్యాచ్ ముగిశాక ఒకరినొకరు హగ్ చేసుకుని పలకరించుకున్నారు. 2025 పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లతో హ్యాండ్ షేక్ చేయకూడదనే స్టాన్స్ ని ఇండియన్ ప్లేయర్లు మెయింటెన్ చేస్తూ వచ్చారు. అయితే ఈ ఫ్రాంచైజీ లీగ్ మ్యాచ్ ఎండ్ అయ్యాక ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడంతో పాటు జెమిమా, ఫాతిమాలు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని హగ్ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Continues below advertisement

Continues below advertisement

సదరన్ బ్రేవ్ గ్రాండ్ విక్టరీ.. జెమిమా రోడ్రిగ్స్ లేట్ ఫైర్‌వర్క్స్సదరన్ బ్రేవ్ తరఫున ఆడిన జెమిమా రోడ్రిగ్స్ 18 బంతుల్లో 28 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచి టీమ్ కి మంచి ఫినిషింగ్ ఇచ్చింది. ఫాతిమా సనా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరఫున నిరాశపరిచింది. ఈ మ్యాచ్ లో సదరన్ బ్రేవ్ 24 రన్స్ తేడాతో విన్ అయి సీజన్ లో వరుసగా ఫోర్త్ విక్టరీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బ్రేవ్ టీమ్ లో లిజెల్ లీ 43, మాయా బౌచియర్ 45 రన్స్ చేయగా జెమిమా 28 రన్స్ తో స్కోరును 140/3 కి చేర్చింది. ఫాతిమా 15 బంతుల్లో 33 రన్స్ ఇచ్చి బౌలింగ్ లో ఫెయిల్ అయింది.

ఛేజింగ్ లో తడబడిన ఫీనిక్స్.. టర్నింగ్ పాయింట్ గా ఓపెనర్ల వికెట్లు141 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఫీనిక్స్ టీమ్ కి టామీ బ్యూమోంట్ (22), దావినా పెర్రిన్ (52) లీడ్ లో 73 రన్స్ పార్టనర్‌షిప్ తో గ్రేట్ స్టార్ట్ లభించింది. అయితే వీరిద్దరూ అవుట్ అవ్వడంతో మ్యాచ్ బ్రేక్ అయింది. సారా గ్లెన్, లారెన్ బెల్ లు వికెట్లు తీసి ఫీనిక్స్ ని ప్రెజర్ లోకి నెట్టారు. సోఫీ మోలినెక్స్ టూ వికెట్స్ పడగొట్టడంతో ఫీనిక్స్ 116/5 రన్స్ కి మాత్రమే పరిమితమై ఓడిపోయింది. ఎల్లీస్ పెర్రీ 16, ఫాతిమా 5 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.

లీగ్ టేబుల్ లో పొజిషన్లు.. వైరల్ హగ్ పై క్రికెట్ లవర్స్ రియాక్షన్ఈ విక్టరీతో సదరన్ బ్రేవ్ అన్‌బీటెన్ రన్ కంటిన్యూ చేస్తుండగా, ఫీనిక్స్ టీమ్ ఒక్క విన్ కూడా లేకుండా లాస్ట్ ప్లేస్ లోనే మిగిలిపోయింది. మ్యాచ్ తర్వాత జెమిమా, ఫాతిమాలు ఫ్రెండ్లీగా కలిసి హగ్ చేసుకోవడం క్రీడాకారుల నడుమ ఉన్న స్పోర్ట్స్ మ్యాన్‌షిప్ కి ఎగ్జాంపుల్ గా నిలిచిందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.