Jasprit Bumrah:  టీమిండియా, ముంబై ఇండియన్స్ జట్లకు చేదువార్త. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023, ఇంకా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూరం కానున్నాడు. ఇప్పటికే వెన్ను గాయం కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి బుమ్రా అందుబాటులో లేడు. ఇప్పుడు ఐపీఎల్ కు, జూన్ లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూరం కానున్నట్లు సమాచారం. 


ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ కు బుమ్రా అందుబాటులో ఉండాలని భారత జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. వరల్డ్ కప్ కు ఇంకా 7 నెలల సమయం ఉంది. ప్రస్తుతానికి బుమ్రా ఎన్ సీఏలో పునరావాసంలో ఉన్నాడు. అతడు పూర్తి మ్యాచ్ ఫిట్ నెస్ సాధించాలంటే కొన్ని నెలల సమయం పడుతుందని వారంటున్నారు. అందుకే ఐపీఎల్ కు దూరం కానున్నాడు. జస్ప్రీత్ బుమ్రా చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ లో భారత్ తరఫున ఆడాడు. బుమ్రా ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. దానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. బుమ్రా గురించి బీసీసీఐ రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ప్రపంచకప్ కు బుమ్రా అందుబాటులో ఉండాలని బీసీసీఐ కోరుకుంటోంది. అని ఎన్ సీఏ అధికారి ఒకరు తెలిపారు. 


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందు నుంచీ జస్ప్రీత్‌ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వెన్నెముక గాయమే ఇందుకు కారణం. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అత్యంత కీలకమైన ప్రపంచకప్‌ ఆడలేదు. శ్రీలంక సిరీసుకు ముందు అతడు ఫిట్‌నెస్‌ సాధించాడని ఎన్‌సీఏ తెలిపింది. సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే ముంబయిలో నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తుండగా అసౌకర్యంగా ఉన్నట్టు బుమ్రా ఫిర్యాదు చేశాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా సిరీస్‌ నుంచి తప్పించారు. న్యూజిలాండ్ సిరీసులకూ ఎంపిక చేయలేదు.






ముంబయికు లోటే


ఐపీఎల్‌లో అత్యంత బలమైన జట్టు ముంబయి ఇండియన్స్‌. వారికి జస్రీత్‌ బుమ్రా ఎంతో కీలకం. అందుకే రూ.12 కోట్లు చెల్లించి రీటెయిన్‌ చేసుకుంది. ఇప్పటికే ఆరు నెలలుగా అతడు క్రికెట్‌ ఆడటం లేదు. టీ20 ప్రపంచకప్‌ నుంచి మైదానానికి దూరంగానే ఉన్నాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. అందుకు తగ్గట్టే ముందు జరిగిన శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ఇబ్బంది ఎదురవ్వడంతో అతడిని తప్పించారు. ప్రస్తుతం అతడు ఎన్‌సీఏలోనే రీహబిలిటేషన్‌లో ఉన్నాడు.


బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి దూరం


ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు, మూడు వన్డేలకు సెలక్టర్లు జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో జస్ప్రీత్‌ బుమ్రాకు చోటు దక్కలేదు. అతడు ఇప్పటికీ పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించకపోవడమే ఇందుకు కారణం. వెన్నెముక గాయం, అత్యంత సున్నితమైన సమస్య కావడంతో అతడి ఎంపికపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు అతడిని తాజాగా ఉంచాలని భావిస్తున్నారు.