బెంగళూరు: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. జమ్మూ కాశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా అవతరించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, ఆ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకోవడం సైతం ఇదే తొలిసారి. 2025-26 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం (ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్) ఆధారంగా జమ్మూ కాశ్మీర్‌ను విజేతగా ప్రకటించడంతో సంబరాలు మొదలయ్యాయి.
67 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలిసారి ఛాంపియన్‌గా జమ్మూ కాశ్మీర్రంజీ ట్రోఫీ ఫైనల్ పోరులో జమ్మూ కాశ్మీర్ మొదట బ్యాటింగ్‌కు దిగి తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేసింది. కర్ణాటక జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 293 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో జమ్మూ కాశ్మీర్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగుల ఆధిక్యం లభించింది. అయినప్పటికీ, జమ్మూ కాశ్మీర్ తమ ప్రత్యర్థి కర్ణాటకకు ఫాలో-ఆన్ ఇవ్వకుండా, రెండో ఇన్నింగ్స్ ఆడి 4 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జమ్మూ కాశ్మీర్‌ను అంపైర్లు విజేతగా ప్రకటించారు.
జమ్మూకాశ్మీర్ తొలిసారి రంజీ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయం జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం. రంజీ ట్రోఫీ గెలవాలనే వారి 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది.
కర్ణాటక టీంలో ఎందరో స్టార్ ప్లేయర్లుఈ టైటిల్ పోరులో కర్ణాటక జట్టులో పలువురు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ముఖ్యంగా టీమిండియాకు పలు ఫార్మాట్లలో ఆడిన కె.ఎల్. రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి స్టార్ ప్లేయర్లు కర్ణాటక జట్టులో ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదు. కర్ణాటక తరపున మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులతో శతక ఇన్నింగ్స్ ఆడాడు. లేకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది.
ఫైనల్‌లో జమ్మూ కాశ్మీర్ హీరోలు వీరే..జమ్మూ కాశ్మీర్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లు వీరే..శుభమ్ పుండిర్: తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు (12 ఫోర్లు, 2 సిక్సర్లు).
యావర్ హసన్: 88 పరుగులు చేశాడు
పరాస్ డోగ్రా (కెప్టెన్): 70 పరుగులు చేశాడు
అబ్దుల్ సమద్: 61 పరుగులు.
ఆకిబ్ నబీ దార్: బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.
కామ్రాన్ ఇక్బాల్: రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్.
సాహిల్ లోత్రా: రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు
