James Anderson: బ్రాడ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన అండర్సన్ - వైరల్ అవుతున్న వీడియో!

యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్ బ్రాడ్ గురించి మాట్లాడుతూ జేమ్స్ అండర్సన్ ఎమోషనల్ అయిన వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

James Anderson On Stuart Broad: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతోంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తన సహచరుడు స్టువర్ట్ బ్రాడ్ గురించి మాట్లాడుతున్నాడు.

Continues below advertisement

జేమ్స్ అండర్సన్ తన తోటి ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ గురించి మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా జేమ్స్ ఆండర్సన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ వీడియోలో జేమ్స్ ఆండర్సన్ స్టువర్ట్ బ్రాడ్‌తో చాలా కాలం పాటు ఆడిన అనుభవాన్ని పంచుకున్నాడు. దీనిపై నెటిజన్లు కూడా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు.

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఓవల్ టెస్ట్ నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగియాల్సి వచ్చింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 135 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 99 బంతుల్లో 58 పరుగులు మీద ఆడుతున్నాడు. తనకు తోడుగా ఉస్మాన్ ఖవాజా 130 బంతుల్లో 69 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. 

ఐదో టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి 384 పరుగులు చేయాల్సి ఉంది. అయితే తమ చివరి మ్యాచ్‌లో వెటరన్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు విజయాన్ని అందించాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే యాషెస్‌ను 3-1తో గెలుచుకుంటుంది. ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది.

Continues below advertisement