"ఇషాన్‌ కిషన్‌పై క్రమశిక్షణ చర్యలేం తీసుకోలేదు. సెలక్షన్‌కు ఇషాన్‌ కిషనే దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో విరామం కావాలని కోరడంతో ఒప్పుకున్నాం. ఇషాన్‌ కిషన్‌ తిరిగి జట్టులోకి రావాలనుకుంటే దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలి" ఇది అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేసిన వ్యాఖ్యలు. ఇషాన్‌ కిషన్‌ దేశవాళీలో సత్తా చాటి మళ్లీ జట్టులోకి రావాలని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. ఈ ట్వీట్‌ తర్వాత ఇషాంత్‌ కిషన్‌ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే మాన‌సికంగా అల‌సిపోయాన‌ని చెప్పి దుబాయ్‌లో పార్టీలు ఎంజాయ్ చేస్తుండ‌డంపై ఇషాన్‌ కిషన్‌పై బీసీసీఐ సీరియ‌స్ అయింద‌ని, ఈ క్రమంలోనే అత‌డిని అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయ‌లేద‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే ఈ వార్తలను ఈ వార్తల‌ను స్వయంగా రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. 

 

డైరెక్ట్‌ తుది జట్టులోకే...

ద్రవిడ్‌ సూచనతో ఇషాన్ త‌ప్పకుండా రంజీట్రోఫీ ఆడ‌తాడ‌ని అంతా భావించారు. తాను దేశ‌వాళీలో ప్రాతినిథ్యం వ‌హిస్తున్న జార్ఖండ్ త‌రుపున బ‌రిలోకి దిగుతాడ‌ని అనుకున్నాను. అయితే.. ఇషాన్ రంజీలు ఆడే విష‌య‌మై త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని జార్ఖండ్ క్రికెట్ అసోసియేష‌న్ కార్యద‌ర్శి చ‌క్రవ‌ర్తి చెప్పారు. ఒక‌వేళ రంజీలు ఆడాల‌ని ఇషాన్ కిష‌న్ అనుకుంటే మాత్రం అత‌డిని నేరుగా తుది జ‌ట్టులోకి తీసుకుంటామ‌ని స్పష్టం చేశాడు. జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఇప్పటి వ‌ర‌కు ఇషాన్ కిష‌న్ నేరుగా స్పందించ‌లేదు. అయితే.. సోష‌ల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇషాన్ యోగా చేయ‌డంతో పాటు మైదానంలో ప‌రుగులు తీస్తూ కనిపించాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. తాను త్వర‌లోనే టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇస్తాన‌ని, అందుకోసం ప్రస్తుతం సిద్ధం అవుతున్నట్లు ఇషాన్ చెప్పక‌నే చెప్పినట్లుగా క‌నిపిస్తోంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

 

తొలి రెండు టెస్టులకు జట్టు ఇదే

ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచుల టెస్ట్‌ సిరీస్‌ కోసం తొలి రెండు టెస్టులకు జట్టు... అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. దాదాపుగా దక్షిణాఫ్రికాతో సిరీస్ లో తలపడిన జట్టునే ఎంపిక చేసింది. . గాయం నుంచి కోలుకోని స్టార్ పేసర్ మహ్మద్ షమి జట్టుకు ఎంపిక కాలేదు. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. అయితే, జట్టులో కేఎల్ రాహుల్ కూడా ఉండటంతో అతను వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సీనియర్‌ ఆటగాళ్లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెలకు మరోసారి నిరాశ తప్పలేదు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ వారికి అవకాశం దక్కలేదు. ఇటీవల రంజీ ట్రోఫీలో డబుల్‌ సెంచరీ సాధించినా పుజారాపై సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. వ్యక్తిగత కారణాలతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ నుంచి వైదొలిగిన ఇషాన్‌ కిషన్‌ను కూడా సెలక్టర్లు జట్టులోకి తీసుకోలేదు. అతడి స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ అవకాశం కల్పించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌ జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. కేఎల్‌ రాహులే వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.