Continues below advertisement

Ishan Kishan Tops ICC T20I Batting Rankings: ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్ లో ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. తన టీమ్‌మేట్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా టాప్ ప్లేస్ లో సెటిల్ అయ్యాడు. దాదాపు ఏడాది కాలంగా నంబర్ వన్ సీటులో కొనసాగుతున్న అభిషేక్ శర్మకు కిషన్ చెక్ పెట్టాడు. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్‌లో జరిగిన సిరీస్ లో ఇండియా 0-2 తో ఓడిపోయినప్పటికీ, అంతకుముందు టీ20 వరల్డ్ కప్ లో కిషన్ చూపించిన మెరుపు పర్ఫార్మెన్స్ అతనికి ఈ కెరీర్ బెస్ట్ రేటింగ్‌ను తెచ్చిపెట్టింది. వరల్డ్ కప్ లో కిషన్ ఏకంగా 200 కి పైగా మైండ్ బ్లోయింగ్ స్ట్రైక్ రేట్‌తో 317 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో కొలంబోలో పాకిస్తాన్‌పై ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఉంది. ప్రెజెంట్ అభిషేక్ శర్మ కంటే కిషన్ కేవలం ఏడు రేటింగ్ పాయింట్ల లీడ్ లో ఉన్నాడు. ఇండియా తరఫున విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ల తర్వాత టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ ప్లేస్ సాధించిన ఫోర్త్ ఇండియన్ మెన్స్ బ్యాటర్‌గా కిషన్ ఒక ఎలైట్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు.

ఐరిష్ ప్లేయర్ల జంప్.. ఆల్‌రౌండర్లలో శివం దూబే అదిరిపోయే గ్రోత్ఇండియాపై సిరీస్ విక్టరీ కొట్టిన ఐర్లాండ్ ప్లేయర్లకు కూడా ఈ ర్యాంకింగ్స్ లో మంచి లాభం చేకూరింది. ఐరిష్ కెప్టెన్ లార్కాన్ టక్కర్ నాలుగు ప్లేసెస్ జంప్ చేసి 77వ స్థానానికి చేరగా, ఓపెనర్ రాస్ అడైర్ ఆరు స్థానాలు ఎగబాకి 84వ ర్యాంక్ అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఇండియా సిరీస్ లో 4 వికెట్లు తీసిన ఐర్లాండ్ సీమర్ మాథ్యూ హంఫ్రీస్ కెరీర్ బెస్ట్ రేటింగ్ తో 25వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ఆల్‌రౌండర్ల లిస్టులో ఇండియా ప్లేయర్ శివం దూబే మూడు స్థానాలు ఇంప్రూవ్ చేసుకుని సెవెంత్ ప్లేస్ లో నిలవగా, ఐర్లాండ్ ప్లేయర్లు గారెత్ డెలానీ 24వ ర్యాంక్ కు, హ్యారీ టెక్టర్ 38వ ర్యాంక్ కు దూసుకొచ్చారు.

Read Also: IND VS Eng T20 Battle: ఇంగ్లాండ్ పోరులోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ప్లేస్.. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ నయా ప్లాన్, ఓపెనర్లుగా మళ్లీ వారే!

టెస్టుల్లో నంబర్ వన్ సీటుపై ట్రావిస్ హెడ్  టీ20లే కాకుండా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లోనూ ఒక మేజర్ చేంజ్ జరిగింది. ఆస్ట్రేలియా పవర్‌ఫుల్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. నాటింగ్‌హామ్‌లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ దారుణంగా ఫెయిల్ అవ్వడం వల్ల ట్రావిస్ హెడ్‌కు ఈ లక్కీ ఛాన్స్ దక్కింది. అంతకుముందు టాప్ లో ఉన్న హ్యారీ బ్రూక్ సెకండ్ ప్లేస్ కు పడిపోగా, జో రూట్ రెండు స్థానాలు కోల్పోయి థర్డ్ ర్యాంక్ లో సెటిల్ అయ్యాడు. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ సాధించిన బిగ్ విక్టరీ వల్ల కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెవెంత్ ప్లేస్ కు, డారిల్ మిచెల్ 11వ స్థానానికి, డెవాన్ కాన్వే ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్ కు దూసుకెళ్లారు.

జస్‌ప్రీత్ బుమ్రా నంబర్ వన్ బౌలర్.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఇండియా ఏస్ పేస్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ తన కింగ్ సైజ్ పొజిషన్ ను దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ సెండ్ ప్లేస్ కు పడిపోవడంతో బుమ్రా ఒంటరిగా నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. కాగా మ్యాచ్ మధ్యలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు స్థానాలు ఇంప్రూవ్ చేసుకుని టెస్ట్ ఆల్‌రౌండర్లలో థర్డ్ ప్లేస్ తో తన కెరీర్ ను ఎండ్ చేశాడు. మరోవైపు యాంటిగ్వాలో శ్రీలంకపై వెస్టిండీస్ సాధించిన సంచలన విజయం వల్ల వారి స్పీడ్‌స్టర్స్ షమర్ జోసెఫ్ 14వ స్థానానికి, కెమర్ రోచ్ 17వ స్థానానికి చేరారు.