- లక్నోతో మ్యాచ్ ఆఖరి బాల్ కు డ్రామా
- నాన్ స్ట్రైకింగ్ ఎండ్ రనౌట్ మిస్ చేసిన హర్షల్
- రనౌట్ జరిగి ఉంటే సూపర్ ఓవర్ కు మ్యాచ్ 
- రూల్స్ లో మార్పును సూచించిన బెన్ స్టోక్స్
- అలా చేస్తే 6 రన్స్ పెనాల్టీ విధించాలని సూచన
- స్టోక్స్ సూచనపై ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్ 


లక్నో, ఆర్సీబీల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2023 మ్యాచ్ లో లాస్ట్ బాల్ కు ఎంత డ్రామా జరిగిందో చూశాం కదా. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో రనౌట్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. అదే స్టంప్స్ ను తాకి ఉంటే లక్నో ఆలౌట్ అయ్యేది. మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లి ఉండేది. ఈ రకంగా నాన్ స్ట్రైకింగ్ రనౌట్ కోసం ట్రై చేయడంతో.. ఇది కరెక్టా కాదా అంటూ మళ్లీ క్రికెట్ ప్రపంచమంతా రెండుగా విడిపోయింది. . 


ఆర్సీబీ, లక్నోతో మ్యాచ్ టై అవుతుందని, సూపర్ ఓవర్ కు వెళ్తుందని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే హర్షల్ పటేల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ రనౌట్ కోసం ట్రై చేశాడు. కానీ హర్షల్ ఫెయిల్ అయ్యాడు. అదే స్టంప్స్ ను తాకి ఉంటే లక్నో ఆలౌట్ అయ్యేది. మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లి ఉండేది. ఈ రకంగా నాన్ స్ట్రైకింగ్ రనౌట్ కోసం ట్రై చేయడంతో..... మళ్లీ క్రికెట్ ప్రపంచమంతా రెండుగా విడిపోయింది. ఇది కరెక్టా కాదా అని భిన్న వాదనలు మొదలయ్యాయి. 


నాన్ స్ట్రైకర్ రనౌట్ కు ఆర్సీబీ బౌలర్ ట్రై చేయడంపై  హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. రవి బిష్ణోయ్ క్లియర్ గా ముందుగానే క్రీజ్ వదిలి బయటకు వెళ్తున్నాడని, ఇంకా ఇలాంటి రనౌట్స్ తప్పు అనే సిల్లీ పీపుల్ ఉన్నారా అని ట్వీట్ చేశాడు. 






దీనిపై సీఎస్కే ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ స్పందించాడు. ఒకవేళ నాన్ స్ట్రైకర్ ముందుగానే వెళ్లినట్టు అంపైర్ భావిస్తే.... బ్యాటింగ్ జట్టుకు 6 రన్స్ పెనాల్టీ విధిస్తే బాగుంటుంది కదా, అప్పుడు ఇంత వివాదం ఉండదు కదా అని బెన్ స్టోక్స్ తన ఆలోచన పంచుకున్నాడు. దీనికి హర్ష రిప్లై ఇచ్చాడు. నీ ఓపినియన్ వినడం ఆనందంగా ఉంది, ఓ మ్యాచ్ కవరేజ్ కోసం చెన్నై వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అని రిప్లై ఇచ్చాడు. 






అయితే బెన్ స్టోక్స్ ఆలోచనపై క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంపైర్ డిస్ క్రిషన్ ఏంటంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు రూల్ బుక్స్ లో క్లియర్ గా ఉన్న రనౌట్ ను ఎందుకు మార్చాలని అంటున్నారు. ఆ రూల్ ను ప్లేయర్ ఎందుకు ఫాలో అవలేడని ప్రశ్నిస్తున్నారు.






వాస్తవానికి మనకు తెలుసుగా..... చాలా మంది ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ క్రికెటర్లు కూడా ఈ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ రనౌట్ కు వ్యతిరేకంగా ఉంటారు. ఏమైనా అంటే క్రీడాస్ఫూర్తిని తెరమీదకు తీసుకొస్తారు. ఇది అశ్విన్-బట్లర్ ఇన్సిడెంట్ నుంచి జరుగుతున్నదే కదా.