Ind Vs Aus Test Series: భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విదేశాల్లో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతని కుటుంబం లండన్‌లో ఎక్కువగా నివసిస్తుండగా, త్వరలోనే పూర్తిగా తన మకాం అక్కడికే మార్చాలని కోహ్లీ భావిస్తున్నట్లు సమచారం. కోహ్లీ విదేశాలకు షిప్టయ్యే విషయంపై అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందించాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కోహ్లీ లండన్‌లో స్థిర పడుతారని పేర్కొన్నాడు. కోహ్లీ భార్య ప్రముఖ సినీ నటి అనుష్క శర్మ, పిల్లలు వామిక, ఆకాయ్‌లతో ప్రస్తుతం లండన్‌లోనే అనుష్క నివసిస్తోంది. నిజానికి ఆకాయ్ కడుపులో ఉన్నప్పటి నుంచే తను లండన్‌లో నివసిస్తోంది.

లండన్‌లో మకాం..కోహ్లీ దంపతులకు లండన్‌లో భారీ భవంతి ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ నుంచి విరామం దొరికినప్పుడల్లా అతను లండన్ చెక్కేసి, తన కుటుంబంతో గడపటానికి కోహ్లీ ఇష్టపడుతుంటాడు. ఇదే నేపథ్యంలో శాశ్వతంగా లండన్‌లోనే స్థిరపడాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, కోహ్లీ కోచ్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం దీనికి బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు ఎక్కువగా లండన్‌లోనే గడపడంపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పలుసార్లు అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. కేవలం మ్యాచ్‌లు ఉన్నప్పుడు మాత్రమే ఇండియాకు రావడం లేదా జట్టుతో కలవడం ఆ తర్వాత లండన్‌కి వెళ్లడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లోనే కోహ్లీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోనున్నాడనే విషయం ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదుSmriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు

రిటైర్మెంట్ యోచన..!!నిజానికి 36వ పడిలో ఉన్న కోహ్లీ.. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు అడపదడపా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. అలాగే ఐపీఎల్ టోర్నీ జరుగుతున్నప్పుడు ఇండియాలో ఎక్కువగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను పూర్తిగా ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే టెస్టుల్లో అంతంతమాత్రంగా రాణిస్తున్న కోహ్లీ.. ఆస్ట్రేలియాతో రాబోయే రెండు టెస్టుల్లో రాణించాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ రెండు టెస్టుల్లో ఒకవేళ విఫలమైతే తన నుంచి రిటైర్మెంట్ లాంటిది ఏదైనా వచ్చే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు గతంలో రిటైర్మెంట్ గురించి కోహ్లీ స్పందించాడు. క్రికెట్లో తాను అనుకున్నవి అన్ని సాధించాను అనుకున్న రోజున అకస్మాత్తుగా రిటైర్మైంట్ ప్రకటిస్తానని తెలిపాడు. అది ఎప్పుడు అన్నది తాను చెప్పలేనని పేర్కొన్నాడు. ఏదేమైనా కోహ్లీ విదేశాల్లో స్థిర పడుతాడుతాడని అతని కోచ్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

Also Read: Look Back 2024 In Sports: తగ్గేదే లే.. 2024లో అదరగొట్టిన టీమిండియా.. అటు ర్యాంకుల్లోనూ, ఇటు రికార్డుల్లోనూ జోరు.. అభిమానులకు గుర్తుండి పోయేలా ఆటతీరు