నోయిడా: భారత క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రింకూ సింగ్ తండ్రి కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆస్పత్రిలో  చివరి శ్వాస విడిచారు. రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ర సింగ్ స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారం అందగానే టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న రింకూ సింగ్ భారత జట్టును వదిలి హుటాహుటిన ఇంటికి తిరిగి వెళ్లాడు. రెండు రోజులపాటు ఆసుపత్రిలో ఉన్న రింకూ జింబాబ్వేతో మ్యాచ్ కు ముందు జట్టులో చేరాడు..

Continues below advertisement

28 ఏళ్ల రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతానికి చెందినవాడు. రింకూ సింగ్ తండ్రి ఖాంచంద్ర సింగ్ గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారు. డాక్టర్లు ఆయనకు రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ (CRRT) అందించారు. టీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన రింకూ సింగ్, ఫ్యామిలి హెల్త్ ఎమర్జెన్సీతో జట్టును వదిలి ఇంటికి వెళ్లిపోయాడని తెలిసిందే. మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియా ప్రాక్టీస్ సెషన్ జరిగింది. అయితే ఈ సెషన్‌కు రింకూ సింగ్ హాజరుకాలేదు. మిగిలిన ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌లో కనిపించారు.

తండ్రి ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారంతో నోయిడాకు వెళ్లిన రింకూ జింబాబ్వేతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని అంతా అనుకున్నారు. అయితే ఈ కీలక పోరుకు ముందే రింకూ జట్టుతో చేరాడు. కానీ ఈ మ్యాచ్‌లో రింకూకు అవకాశం లభించలేదు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి ఖంచంద్ర సింగ్ చనిపోయారన్న సమాచారం అందుకున్న వెంటనే రింకూ సింగ్ తన స్వస్థలానికి బయలుదేరాడు.

Continues below advertisement