Indian Cricket Coaching Shakeup Continues Now Phisio Kamalesh Into Radar..!:  ఇండియన్ క్రికెట్ టీమ్ లో ప్రెజెంట్ బిగ్ చేంజెస్ నడుస్తున్నాయి. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ ఆల్రెడీ నేషనల్ సెటప్ నుంచి బయటకు వెళ్లారు. రీసెంట్ గా హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యంగ్ ప్లేయర్లు ఫ్రీక్వెంట్ గా గాయపడటంతో టీమ్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ పై బిసిసిఐ ఫోకస్ పెట్టింది. కంటిన్యూయస్ ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్ వల్ల బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ని సెలెక్ట్ చేయడం గగనంగా మారింది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ లలో ఓటముల తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ స్టాఫ్ పర్ఫార్మన్స్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తాజా రిపోర్ట్ వెల్లడించింది.

Continues below advertisement

Continues below advertisement

ఫిజియో కమలేష్ జైన్ రోల్ పై రివ్యూ.. గిల్, గంభీర్ తీవ్ర అసంతృప్తి2022 నుంచి హెడ్ ఫిజియోగా బాధ్యతలు చూస్తున్న కమలేష్ జైన్ పర్ఫార్మన్స్ పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తిగా ఉన్నారని బోర్డు వర్గాలు తెలిపాయి. ప్లేయర్లు ఫ్రీక్వెంట్ గా బ్రేక్‌డౌన్ అవ్వడం టీమ్ కాంబినేషన్ దెబ్బతీస్తోంది. "హెడ్ ఫిజియో కమలేష్ జైన్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్స్‌పర్ట్స్ రోల్స్ ఇప్పుడు స్కానర్ లో ఉన్నాయి. ప్లేయర్లను 100% ఫిట్ అవ్వకుండానే హడావుడిగా మైదానంలోకి దించుతున్నారా? అనే క్వశ్చన్స్ కి బోర్డు ఆన్సర్ వెతుకుతోంది" అని బోర్డు వ‌ర్గాలు అంటున్నాయి. 

ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఎమోషనల్ ఫేర్‌వెల్.. ఫైవ్ ఇయర్స్ జర్నీకి ఎండ్ కార్డ్జింబాబ్వే టి20 టూర్ తర్వాత కాంట్రాక్ట్ రెన్యూవల్ కాకపోవడంతో ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. "ఐదేళ్ల జర్నీకి వర్డ్స్ సరిపోవు. ప్రతిరోజూ నా వంద శాతం ఎఫర్ట్ ఇవ్వడానికే ట్రై చేశా. ఈ టీమ్ జర్నీలో నా పార్ట్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది" అని రాసుకొచ్చాడు. 2021 నవంబర్ నుంచి ఇండియన్ టీమ్ తో ఉన్న దిలీప్ ప్లేస్ లో సుభదీప్ ఘోష్ ఫీల్డింగ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు.

శ్రీలంక టూర్ కి కొత్త సపోర్ట్ స్టాఫ్.. ఆగస్టు 15 నుంచి మ్యాచులుఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం న్యూ ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్ టీమ్ తో కలసి ట్రావెల్ చేయనున్నాడు. గాయాల సమస్యల నుంచి బయటపడి ప్లేయర్ల ఫిట్‌నెస్ ని ట్రాక్ లోకి తేవడమే ప్రెజెంట్ బిసిసిఐ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.