IND vs AUS Test Updates: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2024 తొలి పోరు ఆరంభమైంది. భారత్, ఆతిథ్య ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మొదలైంది. రోహిత్ శర్మ గైర్హాజరుతో ఈ టెస్టుకు జస్పిత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు.
ఈ టెస్టు మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. మరోవైపు వాషింగటన్ సుందర్‌కి కూడా ఆడే అవకాశం కల్పించింది టీమిండియా యాజమాన్యం. మొన్నీ మధ్యే సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను దారుణంగా ఓడిపోయిన టీమిండియా తీవ్ర ఒత్తిడిలోనే ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. జట్టులోని కీలక అటగాళ్లంతా పేలవమైన ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు వారంతా ఎలా ఆడతారనే ఆసక్తి అందరిలో ఉంది. రోహిత్ షమి, గిల్ లేకపోవడంతో జట్టు ఎలా పెర్ఫామ్ చేస్తుందనేది అంతా ఎదురు చూస్తున్నారు.
కోహ్లీ, రాహుల్‌పైనే భారం
సీనియర్ బ్యాటర్లుగా ఉన్న విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌పైన బాధ్యత ఉందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే గత కొంత కాలంగా వీళ్లిద్దరి ఆట తీరు నిరాశ పరుస్తూనే ఉంది. ఈఏడాది ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ కేవలం 22.72 సగటుతో పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లీకి ఇదే ఆఖరి టెస్టు సిరీస్ అనే ప్రచారం బలంగా ఉంది. దీంతో గ్రాండ్‌గా వీడ్కోలు చెప్పాలంటే కోహ్లీ బ్యాట్ విదల్చక తప్పదని ఫ్యాన్స్ అంటున్నారు.
కేఎల్ రాహుల్‌ది కూడా అదే కథ. జైస్వాల్‌తో ఇన్నింగ్స్ ఆరంభించే రాహుల్ అద్భుతం చేయాలని క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్, నాల్గో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో పంత్ వస్తారు. తర్వాత ద్రువ్ జురెల్, సుందర్, నితీష్ ఇలా భారత్ బ్యాటింగ్ లైనప్ పెద్దగానే ఉంది. వీళ్లందరిపైనా మంచి అంచనాలే ఉన్నాయి. కానీ వీరిలో చాలా మందికి ఆస్ట్రేలియా పిచ్‌లపై అనుభవం లేకపోవడంతో ఏం చేస్తారనే భయం కూడా ఉంది.
భారత్ టీం ఇదే
KL రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(c), మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా టీం ఇదే
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్
జస్ప్రీత్ బుమ్రా (భారత కెప్టెన్):
"మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం. ఇది మంచి వికెట్‌గా కనిపిస్తోంది. మేము పరిస్థితులకు అనుగుణంగా, బోర్డుపై మంచి స్కోరును ఉంచాలి. ఈ టెస్ట్ మ్యాచ్ ఆటడానికి సన్నద్ధతతో ఉన్నాము. WACAలో మాకు మంచి అనుభవం ఉంది. మేము 2018లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాము."
పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా కెప్టెన్):
"ఈ రెండు జట్ల మధ్య ఏదైనా ఫార్మాట్‌లో ఎప్పుడూ హోరాహోరీగా పోరు జరుగుతూనే ఉంటుంది. టెస్ట్ మ్యాచ్‌లు మరింత క్లోజ్‌గా ఉంటాయి. నాథన్ మెక్‌స్వీనీ తన అరంగేట్రం చేస్తున్నాడు