Pooja Vastrakar's Apology Over Controversial Story On PM Modi: టీమిండియా యువ క్రికెటర్ పూజా వస్త్రాకర్(Pooja Vastrakar) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్‌పై చర్చోపచర్చలు జరుగుతుండడంతో పూజా స్వయంగా స్పందించాల్సి వచ్చింది.
వసూల్ టైటాన్స్ అంటూ....
పూజా వస్త్రాకర్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతోపాటు భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేసిన పూజా దీనికి ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఇదే పెను వివాదానికి కారణమైంది. ఈ ఫొటోలో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌ను తలపించేలా వసూల్ టైటాన్స్ అంటూ పోస్ట్ చేసింది. ఇందులో బీజేపీకి మొత్తం 11 మంది మంత్రులు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంట్ తర్వాత పూజా ఈ ఫొటోను షేర్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ఏజెన్సీల దర్యాప్తును తప్పించుకునేందుకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ దోపిడీ రాకెట్‌ను ప్రారంభించిందని కేజ్రీవాల్ విమర్శించారు. దీని తర్వాత పూజా వసూల్ టైటాన్స్ అంటూ ప్రధాని మోదీ ఉన్న ఫొటోను ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పూజా వస్త్రాకర్ ఈ పోస్ట్‌ను తొలగించారు. పూజా వస్త్రాకర్ పోస్ట్‌ను తొలగించినప్పటికీ అంతకుముందే వ్యక్తులు తీసిన స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పూజా వస్త్రాకర్ పోస్ట్‌పై నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు పూజాను కాంగ్రెస్‌కు మద్దతుదారు అని పిలుస్తుండగా, మరికొందరు ఇలాంటి పోస్ట్‌ను షేర్ చేసినందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పూజా క్లారిటీ..
విమర్శలు.. మద్దతు కామెంట్లతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండడంతో పూజా వస్త్రాకర్ క్లారిటీ ఇచ్చారు. పూజా వస్త్రాకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక పోస్ట్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి అభ్యంతరకరమైన పోస్ట్ షేర్ చేయడాన్ని తాను గుర్తించినట్లు పూజా తెలిపారు. తనకు ప్రధాని మోదీ అంటే చాలా గౌరవమని... ఫోన్ తన దగ్గర లేనప్పుడు ఎవరో ఈ పోస్ట్ చేశారని పూజా తెలిపారు. దీని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని పూజ కోరారు.
ఈ ఖర్చు వివరాలు తెలుసా..?
దేశంలో సార్వత్రిక ఎన్నికలు వేళ.. ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయి ప్రచారం కోసం అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు, బహిరంగ సభలకు వచ్చే ప్రజలు తినే చిరుతిళ్లు, అల్పాహారాలు, భోజనాల కోసం ఎంత మొత్తాన్ని వెచ్చించాలో జిల్లాల ఎన్నికల అధికారులు పార్టీలు, అభ్యర్థులకు నిర్దేశిస్తున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఛాయ్‌కి 15, సమోసాకు 15రూపాయలుగా ధర నిర్ణయించారు. మధ్యప్రదేశ్ మండ్లాలో టీకి 7, సమోసకు ఏడున్నర రూపాయలుగా ధరను ఫిక్స్ చేశారు. కేజీ మటన్‌కు 500, చికెన్‌కు 250, లస్సీకి 20, నిమ్మరసానికి 15 రూపాయలుగా ధర నిర్ణయించారు. బాలాఘాట్‌లో రేట్‌కార్డులో టీకి 5, సమోసాకు 10, ఇడ్లీ, వడ, పోహ వంటివాటికి 20, దోసా, ఉప్మాలకు 30 రూపాయలుగా ధరను నిర్ణయించారు.