IND vs SA T20I Records: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాటర్లు వేగంగా పరుగులు సాధిస్తుంటారు. రెండు జట్లు కూడా ఏ బౌలింగ్ దాడిని అయినా తుత్తునియలు చేసే సామర్థ్యం ఉన్న విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ను కలిగి ఉన్నాయి. ఈ కారణంతో ఈ రెండు జట్లు టీ20 ఫార్మాట్‌లో తలపడినప్పుడల్లా భారీ స్కోర్లు నమోదవుతాయి. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని రికార్డులు, స్కోర్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Continues below advertisement

భారత్ చారిత్రాత్మక 283 పరుగులు

భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 చరిత్రలో అత్యధిక స్కోరు నవంబర్ 15, 2024న నమోదైంది. జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి 283 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. భారత్ రన్ రేట్ 14 కంటే ఎక్కువగా ఉంది. ఇది టీ20 క్రికెట్‌లో అసాధారణ స్కోరుగా చెప్పవచ్చు. భారత్ ఈ మ్యాచ్‌ను ఈజీగా గెలిచి చరిత్ర సృష్టించింది.

Continues below advertisement

గువాహటిలో బ్యాటింగ్ లో భారత్ జోరు 

అక్టోబర్ 2, 2022న గువాహటిలో జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 237 పరుగులు చేసింది. భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి ఈ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ 20 ఓవర్ల పాటు సఫారీ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. దాదాపు 12 రన్ రేట్ తో పరుగులు రాబట్టారు. భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో తమ స్థానాన్ని మెరుగు చేసుకుంది.

దక్షిణాఫ్రికా ప్రతిఘటన

భారత్‌పై భారీ స్కోర్లు చేయడంలో దక్షిణాఫ్రికా కూడా వెనుకబడలేదు. అక్టోబర్ 4, 2022న ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 227 పరుగులు చేసి భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్రికా బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లపై ఎదురు దాడి చేసి  11 రన్ రేట్ కంటే ఎక్కువగా ఉంచారు.

గువాహటిలో హై స్కోరింగ్ థ్రిల్లర్

అక్టోబర్ 2, 2022న గువాహటిలో మరో హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది., ఇక్కడ దక్షిణాఫ్రికా 221 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దాంతో ఉత్కంఠ పోరులో భారత్ మ్యాచ్ గెలిచింది. అయినప్పటికీ, ఈ మ్యాచ్ బ్యాటర్లకు చిరస్మరణీయంగా నిలిచింది.

జోహన్నెస్‌బర్గ్‌లో 219 పరుగులు

మార్చి 30, 2012న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా 219 పరుగులు చేసింది. ఆ సమయంలో టీ20 క్రికెట్‌లో ఈ స్కోరు చాలా బిగ్ స్కోర్ గా పరిగణించేవారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.