Ind Vs Eng Test Series Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ ఓ డిన భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా లీడ్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ గా శుభమాన్ గిల్ అరంగేట్రం చేస్తున్నాడు. పిచ్ తో కూడిన ఈ పిచ్ బౌలర్లకు ఉపయుక్తంగా ఉంటుందని తెలుస్తోంది. గత చివరి ఆరు మ్యాచ్ ల్లో టాస్ గెలిచిన జట్లు బౌలింగ్ ఎంచుకున్నాయి. ఏదేమైనా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ తోనే 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ లోని తొలి టెస్టుని ఆడబోతోంది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టులో కొన్ని మార్పులు చేసింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాల్లో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ లను తీసుకుంది. ఇక తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డికి మొండిచేయి ఎదురైంది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు.
ఆరో స్థానంలో కరుణ్..
చాలా కాాలం తర్వాత జట్టులోకి కరుణ్ నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. తను ఈ మ్యాచ్ లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక బ్యాటింగ్ లైనప్ విషయానికొస్తే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ తనకు డెబ్యూ కావడం విశేషం. సీనియర్ ప్లేయర్ అయిన అభిమన్యు ఈశ్వరన్ ను కాదని సుదర్శన్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవల ఐపీఎల్లో రెడ్ హాట్ ఫామ్ లో ఉండటమే దీనికి కారణం. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తారు. స్పిన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా బరిలోకి దిగుతాడు.
నితీశ్ కు మొండి చేయి..
ఇక పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి తుదిజట్టులో చోటు దక్కలేదు. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్ లో నితీశ్ రాణించినప్పటికీ, అతనికి లక్కు కలిసి రాలేదు. గతంలో ఇక్కడ సత్తా చాటిన తీరు ఇంకా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఠాకూర్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇక స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతున్నాడు. ఈ సిరీస్ లో కేవలం మూడు మ్యాచ్ లే తను ఆడనున్నట్లు తెలుస్తోంది. మిగతా పేసర్లుగా ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు. దీంతో ఏకైక స్పిన్నర్ గా జడేజా మాత్రమే ఆడనున్నాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు జరుగతుంది.