India Face Bangladesh In Crucial Must Win Match:  ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 లో ఇండియా సెమీఫైనల్స్ చేరే దారి ఇప్పటికీ తమ చేతుల్లోనే ఉన్నా, గురువారం బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్ లో అస్సలు అజాగ్రత్తగా ఉండటానికి వీల్లేదు. టోర్నమెంట్ మోస్ట్ క్రూషియల్ ఫేజ్‌కి చేరిన వేళ, గ్రూప్-A లో మంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆర్మీని కొన్ని లోపాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇండియాకు ఇప్పుడు టాప్ ఆర్డర్ తో ఎలాంటి సమస్యా లేదు. ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ పై ఉన్న డౌట్స్ అన్నీ స్మృతి మంధాన, షఫాలీ వర్మ తమ అగ్రెసివ్ బ్యాటింగ్ తో క్లియర్ చేసేశారు. ఈ ఓపెనింగ్ జోడీ ప్రతీ మ్యాచ్ లోనూ పవర్‌ప్లేను డామినేట్ చేస్తూ సాలిడ్ ఫౌండేషన్ ఇస్తోంది.

Continues below advertisement

 

మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఫెయిల్యూర్స్.. ఓపెనర్లు ఇచ్చే సాలిడ్ స్టార్ట్ ను బిగ్ స్కోర్లుగా మార్చడంలో ఇండియా మిడిల్ ఆర్డర్ ఘోరంగా స్ట్రగుల్ అవుతోంది. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు స్లో అవ్వడం వల్ల రన్ రేట్ బాగా పడిపోతోంది. దీంతో లాస్ట్ లో వచ్చే ఫినిషర్లు రిచా ఘోష్, దీప్తి శర్మ తక్కువ బంతుల్లో ఎక్కువ రన్స్ చేయాల్సి వస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో ఈ మిస్టేక్ వల్లే ఇండియా ఓడిపోయింది. ప్రొటీస్ టీమ్‌ను 25 రన్స్ కే 2 వికెట్లు పడగొట్టి కంప్లీట్ కంట్రోల్ లోకి వచ్చినా, ఫీల్డింగ్‌లో ఈజీ క్యాచులు డ్రాప్ చేయడం వల్ల మ్యాచ్ చేజారిపోయింది. నాకౌట్ స్టేజ్ లో ఇలాంటి చిన్న తప్పులు చేసినా టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఖాయం.

Read Also: Hardik Pandya News: MIకు హార్దిక్ పాండ్యా గుడ్‌బై..! కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అంబానీల సీక్రెట్ డీల్, కేకేఆర్ కెప్టెన్‌గా కొత్త అవతారం!!

పాక్, నెద‌ర్లాండ్స్ ను దెబ్బకొట్టిన బంగ్లాదేశ్.. మరోవైపు బంగ్లాదేశ్ ఉమెన్స్ టీమ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో దూసుకుపోతోంది. పాకిస్తాన్‌తో పాటు  నెద‌ర్లాండ్స్ ఓడించి జోరుమీదుంది. బంగ్లాదేశ్ కేవలం ఒక్క ప్లేయర్ పైనే డిపెండ్ అవ్వకుండా ప్రతీ ఒక్కరూ కలెక్టివ్ గా కాంట్రిబ్యూట్ చేస్తూ స్మార్ట్ గేమ్ ప్లాన్ తో ఆడుతున్నారు. ఇండియాకు సెమీస్ బెర్త్ పక్కా అవ్వాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం, అప్పుడే ఆస్ట్రేలియాతో జరగబోయే నెక్స్ట్ బిగ్ ఫైట్ కు ముందు టీమ్‌కు మంచి బూస్ట్ దొరుకుతుంది. బంగ్లాదేశ్ మరో అప్‌సెట్ క్రియేట్ చేస్తే గ్రూప్-A పాయింట్స్ టేబుల్ సమీకరణాలు కంప్లీట్‌గా చేంజ్ అయిపోతాయి.

ఓల్డ్ ట్రాఫోర్డ్ లో లైవ్ యాక్షన్.. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ గురువారం ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 7:00 గంటలకు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో లైవ్ టీవీ బ్రాడ్‌కాస్ట్ ద్వారా, అలాగే జియోహాట్‌స్టార్ (JioHotstar) యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. ఇండియా స్క్వాడ్ లో హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, యాస్తికా భాటియా, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, రాధా యాదవ్, నందిని శర్మ, శ్రీ చరణి ఉన్నారు. బంగ్లాదేశ్ స్క్వాడ్ లో నిగర్ సుల్తానా (కెప్టెన్), నహిదా అక్తర్, దిలారా అక్తర్, జువైరియా ఫిరదౌస్, శోభనా మోస్తరి, తేజ్ నెహార్, శర్మిన్ అక్తర్, రాబేయా ఖాన్, రీతు మోని, శోర్నా అక్తర్, ఫహిమా ఖాతున్, ఫరిహా త్రిస్నా, మరుఫా అక్తర్, సంజిదా అక్తర్, సుల్తానా ఖాతున్ ఉన్నారు. ప్రెజర్ సిట్యుయేషన్స్ ను ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారో వారిదే విక్టరీ అని తెలుస్తోంది.