IND VS BANG 2ND ODI:  భారత్- బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే ఢాకా వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లా జట్టు కెప్టెన్ లిటన్ దాస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ వికెట్ మొదట బ్యాటింగ్ కు సహకరించేలా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కష్టమని మొదటి మ్యాచులో అర్ధమైంది. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నాం అని బంగ్లా కెప్టెన్ తెలిపాడు. ఆ జట్టులో హసన్ మహమూద్ కు బదులు నసుమ్ ను తీసుకున్నారు. 


టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుందామని అనుకున్నాము. మేం అనుకున్నట్లే మొదట ఫీల్డింగ్ చేయబోతున్నాం. వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేస్తామనే నమ్మకం ఉంది. మొదటి మ్యాచులో చేసిన తప్పుల్ని పునరావృతం చేయం. మా జట్టులో రెండు మార్పులు జరిగాయి. అని టీమిండియా కెప్టెన్ రోహిత్ చెప్పాడు. 


భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్... కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ లు జట్టులోకి వచ్చారు.
ఈ మ్యాచ్ సోనీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే సోనీ లివ్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. 






బంగ్లాదేశ్ తుది జట్టు


నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్(కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్.


భారత్ తుది జట్టు


రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్