India Face Unbeaten Australia In Virtual Quarterfinal:  ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 లో సెమీఫైనల్ బెర్త్ కోసం లండన్ వేదికగా ఆదివారం జరగబోయే లాస్ట్ గ్రూప్-A మ్యాచ్ లో సిక్స్-టైమ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్ లీడర్‌షిప్‌లోని ఇండియాకు ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. గ్రూప్ నుంచి సెమీస్ చేరే జట్లను ఆదివారం జరిగే రెండు మ్యాచ్‌లు డిసైడ్ చేయనున్నాయి. లార్డ్స్ మైదానంలో సౌతాఫ్రికా (6 పాయింట్లు), బంగ్లాదేశ్ (4 పాయింట్లు) మ్యాచ్ ఫస్ట్ జరగనుంది. ఆ తర్వాత ఇండియా (6 పాయింట్లు), అజేయంగా ఉన్న ఆస్ట్రేలియా (8 పాయింట్లు) తలపడతాయి. బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికాకు ఉన్న 9-2 అద్భుతమైన రికార్డ్ ప్రకారం ఆ జట్టు గెలవడం దాదాపు ఖాయం. ఒకవేళ ప్రొటీస్ టీమ్ గెలిస్తే, ఇండియా సెమీస్ వెళ్లాలంటే ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాల్సిందే. ఓడిపోతే మాత్రం ప్రస్తుత వన్డే వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఇండియా టోర్నీ నుంచి అవుట్ అవుతుంది.

Continues below advertisement

Continues below advertisement

ఆస్ట్రేలియాకు అడ్వాంటేజ్.. మరో ఎండ్ లో ఆస్ట్రేలియా ఆల్రెడీ 8 పాయింట్లు, 4.724 భారీ నెట్ రన్ రేట్ కలిగి ఉండటం వల్ల ఈ మ్యాచ్ లో ఓడిపోయినా సేఫ్ గా సెమీస్ కి వెళ్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ ఏమైనా మిరాకిల్ చేసి సౌతాఫ్రికాను ఓడిస్తే ఇండియాపై ప్రెజర్ తగ్గుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓడినా ఇండియా నెట్ రన్ రేట్ (2.268) ప్రెజెంట్ సౌతాఫ్రికా (0.734) కంటే బెటర్ గా ఉంటే చాలు, హర్మన్‌ప్రీత్ సేన లాస్ట్ ఫోర్ లోకి ఈజీగా దూసుకెళ్తుంది. కానీ బలమైన కంగారూలపై గెలవడం ఇండియాకు ఒక పెద్ద క్యారెక్టర్ టెస్ట్ లాంటిది. టోర్నీ స్టార్టింగ్ లో ఓపెనర్ల ఫామ్ సమస్యగా ఉన్నా స్మృతి మంధాన (167 రన్స్), షఫాలీ వర్మ (145 రన్స్) కంబ్యాక్ ఇచ్చారు. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (85 రన్స్), జెమిమా రోడ్రిగ్స్ (58 రన్స్) లతో కూడిన మిడిల్ ఆర్డర్ కన్సిస్టెంట్‌గా ఫెయిల్ అవుతుండటం టీమ్‌ను బాగా వేధిస్తోంది.

Read Also:  Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?

ఫీల్డింగ్ లో ఘోర తప్పిదాలు.. బ్యాటింగ్ లోనే కాకుండా ఫీల్డింగ్ లోనూ ఇండియా దారుణంగా పడిపోయింది. లాస్ట్ రెండు మ్యాచుల్లో ఇండియన్ ఫీల్డర్లు ఏకంగా ఆరు ఈజీ క్యాచులు డ్రాప్ చేశారు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఈ మిస్టేక్స్ వల్లే ఇండియా ఓడిపోయింది. బంగ్లాదేశ్ మ్యాచ్ లో నాలుగు క్యాచులు చేజార్చినా వికెట్ల తేడాతో గెలిచి ఎలాగోలా గట్టెక్కింది. జనరల్ గా బెస్ట్ ఫీల్డర్ అయిన రాధా యాదవ్ ఈ ఆరు క్యాచుల్లో మూడు క్యాచులు డ్రాప్ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఆస్ట్రేలియా లాంటి పవర్‌ఫుల్ టీమ్ పై ఇలాంటి చిన్న తప్పులు చేసినా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ అస్సలు దక్కదని హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ టీమ్‌ను హెచ్చరించాడు. బౌలింగ్ లోనూ అందరూ కలెక్టివ్ గా క్లిక్ అవ్వకపోవడం మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

జెమిమా సెంటిమెంట్.. అయితే గతంలో వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించి హిస్టారికల్ గ్లోబల్ టైటిల్ గెలిచిన మెమొరీస్ నుంచి ఇండియా ప్రెజెంట్ ఇన్స్ పిరేషన్ పొందుతోంది. ఆ మ్యాచ్ లో జెమిమా రోడ్రిగ్స్ ఆడిన లైఫ్ టైమ్ ఇన్నింగ్స్ వల్లే ఇండియా ఫైనల్ చేరింది. ప్రెజెంట్ టోర్నీలో 4 మ్యాచుల్లో 12 వికెట్లు తీసి డ్రీమ్ ఫామ్ లో ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి పైనే ఇండియా ఎక్కువ డిపెండ్ అయింది. కాగా ఆస్ట్రేలియా టీమ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో సెమీస్ పై కన్నేసింది. ఇండియాపై బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడే వారి స్టార్ ప్లేయర్ ఫోబ్ లిచ్ ఫీల్డ్ కాఫ్ ఇంజరీ నుంచి కోలుకుని ఈ మ్యాచ్ తో కంబ్యాక్ ఇవ్వడం ఆసీస్ కు కొండంత బలాన్ని ఇస్తోందని స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్ స్పష్టం చేశాడు.