Starc-Maxwell Ruled Out: సుదీర్ఘ షెడ్యూల్‌కు ముందు భారత్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తాకింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఇద్దరు తొలి వన్డేకు దూరమయ్యారు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, స్పిన్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు మొహాలీ వేదికగా గురువారం (సెప్టెంబర్ 22న) జరుగబోయే తొలి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
భారత్ - ఆసీస్ తొలి వన్డే ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కమిన్స్ మాట్లాడుతూ.. ‘స్టార్క్ భారత్‌కు వచ్చాడు గానీ రేపు అతడు ఆడటం లేదు. కానీ అతడు తర్వాతి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం. గ్లెన్ మ్యాక్స్‌వెల్ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఇదిలాఉండగా వన్డే సిరీస్‌లో ఆడతారా..? లేదా..? అని అనుమానాలు ఉన్నప్పటికీ కమిన్స్, స్టీవ్ స్మిత్‌లు తొలి వన్డే ఆడతారని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి. స్మిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా పోస్ట్ చేస్తూ అతడు వన్డే సిరీస్‌కు రెడీ అవుతున్నట్టుగా పేర్కొంది. ఇక కమిన్స్ కూడా సుమారు పది నెలల తర్వాత వన్డేలు ఆడనున్నాడు. ఆసీస్ సారథి చివరిసారి నవంబర్‌లో వన్డేలు ఆడాడు. ‘నేను ఇప్పుడైతే బాగానే ఉన్నా. నా మణికట్టు గాయం పూర్తిగా నయమైంది. నేనిప్పుడు వంద శాతం ఫిట్‌గా ఉన్నా. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లూ ఆడతానని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.
కాగా స్టార్క్, మ్యాక్స్‌వెల్ ఎందుకు ఆడటం లేదనే విషయాన్ని మాత్రం కమిన్స్ బహిర్గతపరచలేదు. స్టార్క్ చివరిసారిగా ఈ ఏడాది భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. కానీ యాషెస్ సిరీస్ ముగిశాక అతడు కాలిగాయం కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లలేదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సౌతాఫ్రికాకు వెళ్లినా సరిగ్గా టీ20 సిరీస్ ముందు చీలమండ గాయంతో ఆసీస్‌కు తిరుగుపయనమయ్యాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కూడా దూరం కావడంతో పూర్తి ఫిట్‌నెస్ సాధించారా..? లేక వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని రిస్క్ ఎందుకు...? అని పక్కనబెట్టారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కేరీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హెజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా