వరల్డ్ కప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో తలపడనున్న భారత జట్టు ప్లేయింగ్-11లో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. రవిచంద్రన్ అశ్విన్‌ను రిజ్వర్‌ బెంచ్‌కు పరిమితం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు టీమ్ఇండియా అవకాశం ఇవ్వవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఇక్కడి పిచ్ గత మ్యాచ్ (చెపాక్) పిచ్ కు పూర్తి భిన్నంగా ఉంటుంది.


చెపాక్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ల కారణంగా భారత్ ఈ వ్యూహాన్ని అనుసరించింది. ఇప్పుడు ఢిల్లీ పిచ్ చెపాక్ అంత స్పిన్ ఫ్రెండ్లీగా లేకపోవడంతో స్పిన్ ఆల్‌రౌండర్‌కు బదులు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌ రౌండర్‌ను ప్లేయింగ్‌ 11లో టీమ్ఇండియా ఎంపిక చేయవచ్చు. ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో మహ్మద్ షమీకి కూడా ఛాన్‌ దక్కే అవకాశం ఉంది. కానీ శార్దూల్ బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి అతని వైపు ఎక్కువ మొగ్గు చూపొచ్చు. 


నేటి మ్యాచ్‌కి కూడా శుభ్మన్ గిల్ దూరంగా ఉన్నాడు. టీమ్ఇండియాతో కలిసి ఆయన ఢిల్లీకి కూడా రాలేదు. డెంగీ నుంచి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ మరోసారి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. 


టీమ్ఇండియా ప్లేయింగ్-11 ఎలా ఉంటుంది?
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.


ఆప్ఘనిస్థాన్ ప్లేయింగ్-11 ఎలా ఉంటుంది?
అఫ్గానిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులకు ఆస్కారం లేదు. అఫ్గానిస్తాన్ తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ, అదే ప్లేయింగ్ -11తో మైదానంలో కనిపంచనుంది. 


రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్, ముజీబ్ యువర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ.


ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలు


ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ ఇవాళ(బుధవారం )జరగనుంది.


ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.


ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?


ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు (IST) ప్రారంభమవుతుంది. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు టాస్ వేస్తారు. 


ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌ను దేశంలో ఏ టీవీ ఛానెల్ ప్రసారం చేస్తుంది?


ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తారు. 


ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌ని ఉచితంగా ఎక్కడ చూడొచ్చు ?


ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ మొబైల్‌లో Disney+Hotstarలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. IND vs AFG ODI ప్రపంచ కప్ 2023 మ్యాచ్ తాజా స్కోర్, అప్‌డేట్‌లను పొందడానికి https://telugu.abplive.com/ వెబ్‌సైట్‌లో చూడండి.