Harshit Rana, Varun Chakaravarthy Ruled Out Of T20I Series: ఇంగ్లాండ్ టూర్ లో ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ ఓటములతో సఫర్ అవుతున్న టీమిండియాకు మరో మైండ్ బ్లాకింగ్ డబుల్ షాక్ తగిలింది. టీమ్‌లోని కీ ప్లేయర్లు, పేసర్ హర్షిత్ రాణా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి హ్యామ్‌స్ట్రింగ్ గాయ‌ల వల్ల ఈ టీ20 సిరీస్ లోని లాస్ట్ టూ మ్యాచుల నుంచి కంప్లీట్‌గా రూల్డ్ అవుట్ అయ్యారు. ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన థర్డ్ టీ20 మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న టైమ్‌లో వీరిద్దరికీ ఈ గాయాలు అయినట్లు BCCI గురువారం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. బీసీసీఐ మెడికల్ టీమ్ వీరిని టెస్ట్ చేసి ఫోర్త్, ఫిఫ్త్ టీ20 మ్యాచుల నుంచి వీరిని త‌ప్పించింది.

Continues below advertisement

Continues below advertisement

 

బ్రిస్టల్ టీ20 లో ఇండియా చేంజెస్.. వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ ఇన్గాయాల‌తో  బ్రిస్టల్‌లో జరుగుతున్న ఫోర్త్ టీ20 మ్యాచ్ కోసం ఇండియా తమ ప్లేయింగ్ ఎలెవన్ లో రెండు మేజర్ చేంజెస్ చేయాల్సి వచ్చింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోగా, జ‌ట్టుకు దూరమైన వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాల ప్లేసెస్ లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ టీమ్‌లోకి వచ్చారు. ఫైవ్-మ్యాచ్ టీ20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల వాషౌట్ కాగా, ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయిన ఇండియా ప్రెజెంట్ 0-2 తో వెనుకబడింది. సిరీస్ లో నిలవాలంటే ఇండియాకు ఈ ఫోర్త్ మ్యాచ్ విక్టరీ చాలా క్రూషియల్. మరోవైపు ఇంగ్లాండ్ టీమ్ లియామ్ డాసన్ ప్లేస్ లో రెహాన్ అహ్మద్ ను తీసుకువచ్చి ఒక్క చేంజ్ మాత్రమే చేసింది.

Read Also: IND VS ENG Historic Lords Test: లార్డ్స్ హిస్టారికల్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!

రీసెంట్ గానే కంబ్యాక్ ఇచ్చిన స్టార్ ప్లేయర్లుహర్షిత్ రాణా సెండ్ టీ20 మ్యాచ్ లో 40 రన్స్ ఇచ్చి టూ వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి థర్డ్ మ్యాచ్ లో వికెట్ లేకుండా 35 రన్స్ సమర్పించుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు ప్లేయర్లు రీసెంట్ గానే పెద్ద గాయాల నుంచి కోలుకుని టీమ్‌లోకి కంబ్యాక్ ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ లో లెఫ్ట్ ఫుట్ లో వచ్చిన హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు. మరో ఎండ్ లో హర్షిత్ రాణా మోకాలి గాయంతో ఐపీఎల్ 2026 సీజన్ తో పాటు టీ20 వరల్డ్ కప్ కు కూడా కంప్లీట్‌గా దూరమయ్యాడు. ఇంతలోనే మళ్లీ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ తిరగబెట్టడం షాకింగ్ గా భావించ‌వ‌చ్చు.

బ్రిస్టల్ పోరుకు పక్కా స్క్వాడ్.. సిరీస్ పై అయ్యర్ సేన ఆశలుబ్రిస్టల్ టీ20 లో ఇంగ్లాండ్ స్క్వాడ్ లో హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, జోష్ టంగ్ ఆడుతున్నారు. ఇండియా అఫీషియల్ స్క్వాడ్ లో శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ బరిలోకి దిగారు.