KL Rahul fighiting Hard: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఆదివారం నాలుగో రోజు 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా..కాస్త కష్టాల్లో పడింది. ఆట ముగిసేసరికి 17.4 ఓవర్లలో 4 వికెట్లకు 58 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 33 బ్యాటింగ్, 6 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా విజయానికి ఇంకా 135 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇండియాకు 193 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. సోమవారం ఆటకు చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ లో ఫలితం తేలడం ఖాయంగా మారింది. ప్రస్తుత పరిస్థితి, పిచ్ ను అంచనా వేసినట్లయితే ఇరుజట్లకు గెలుపు అవకాశాలు ఉన్నాయి.
ఇంగ్లాండ్ దూకుడు..ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియాను ఇంగ్లాండ్ కాసేపు బెంబేలెత్తించింది. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్, కరుణ్ నాయర్ (14), కెప్టెన్ శుభమాన్ గిల్ (6) వికెట్లను తీసి మ్యాచ్ లోకి వచ్చింది. నిజానికి ఈ సిరీస్ లో శుభారంభాలు ఇచ్చిన భారత ఓపెనర్లు ఈ ఇన్నింగ్స్ లో మాత్రం ఆ పని చేయలేకపోయారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే యశస్వి జైస్వాల్.. జోఫ్రా ఆర్చర్ లో బౌలింగ్ లో లేని పుల్ షాట్ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో 5 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో కరుణ్, రాహుల్ కలిసి కొన్ని బౌండరీలు బాది, ఒత్తిడిని తగ్గించారు. వీరిద్దరూ ఈజీగా ఆడటంతో ఇంగ్లాండ్ పై కాస్త ఒత్తిడి పడింది. అయితే బాగా ఆడుతున్న కరుణ్.. బ్రైడెన్ కార్స్ బౌలింగ్ లో బంతిని రాంగ్ గా అంచనా వేసి, ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి క్రీజులో అసౌకర్యంగా కదిలిన గిల్.. కార్స్ బౌలింగ్ లోనే ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత నైట్ వాచ్ మన్ గా వచ్చిన ఆకాశ్ దీప్
బౌలర్ల హవా..పిచ్ నుంచి వస్తున్న మద్ధతును బాగా సద్వినియోగం చేసుకున్న భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను త్వరగా కట్టడి చేశారు. దీంతో 62.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో 192 పరుగుల లీడ్ ఇంగ్లాండ్ కు లభించింది. వెటరన్ బ్యాటర్ జో రూట్ (40) టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో చెలరేగగా, స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కు రెండేసి వికెట్లు దక్కాయి. ఇక ఐదు టెస్టుల సిరీస్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు 2-1తో ఆధిక్యంలోకి వెళుతుంది.