India Predicted Playing XI For One Off Test Match: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ప్రిపరేషన్స్ లో భాగంగా ఇండియా కీలకమైన టెస్ట్ మ్యాచ్ కు సిద్ధమైంది. శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్తాన్ తో జరిగే ఏకైక టెస్ట్ లో శుభ్‌మన్ గిల్ లీడర్ షిప్ లోని ఇండియా టీమ్ తలపడనుంది. ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీ సైకిల్ లో భాగం కాకపోయినప్పటికీ టీమ్ కాంబినేషన్ ను టెస్ట్ చేసుకోవడానికి ఇండియాకు ఇది ఒక మంచి ఛాన్స్. గత నవంబర్ లో సౌతాఫ్రికా సిరీస్ తర్వాత ఇండియా ఆడుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇదే. ఐపీఎల్ 2026 ఫైనల్స్ లో ఆడిన ఎనిమిది మంది ప్లేయర్స్ ఈ స్క్వాడ్ లో ఉండటంతో వాళ్లకు ఇదొక టఫ్ టెస్ట్ కానుంది. స్టార్ ప్లేయర్స్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడటం లేదు.

Continues below advertisement

Read Also: India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!

ఓపెనర్లుగా రాహుల్, జైస్వాల్.. 

Continues below advertisement

ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ లో కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. నంబర్ 3 లో సాయి సుదర్శన్ బ్యాటింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. దేవదత్ పడిక్కల్ కంటే సాయి సుదర్శన్ కే తన సపోర్ట్ ఉంటుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హింట్ ఇచ్చాడు. సాయి సుదర్శన్ కు ఇప్పటివరకు ఫెయిర్ ఛాన్స్ రాలేదని, అతడు ఎక్కువగా ఇంగ్లాండ్ లోనే ఆడాడని, అందుకే అతడికి ఈసారి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని నమ్ముతున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. రీసెంట్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున దుమ్మురేపిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు.

Read Also: Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!

రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ ఎఫెక్ట్.. 

వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంటాడు. పంత్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై చాలా డిస్కషన్స్ జరిగినప్పటికీ ధ్రువ్ జురెల్ కంటే అతడికే సెలెక్టర్లు మొగ్గు చూపారు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి టీమ్ లో కీలక పాత్ర పోషించనున్నారు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చూసుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఎంపిక ఖాయమైంది. స్పిన్ డిపార్ట్‌మెంట్ లో హర్ష్ దూబే లేదా మానవ్ సుతార్ లలో ఒకరు రేపు టెస్ట్ డెబ్యూ చేయబోతున్నారు.

అఫ్గానిస్తాన్ టెస్ట్ మ్యాచ్ కోసం ఇండియా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవెన్:

కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే / మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.