Ind VS wi 2nd test Yashasvi Jaiswal 7th century latest News:  వెస్టిండీస్ తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త్ భారీ స్కోరు దిశ‌గా సాగుతోంది. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ భారీ అజేయ సెంచ‌రీ (253 బంతుల్లో 173 బ్యాటింగ్, 22 ఫోర్లు)తో స‌త్తా చాట‌డంతో తొలిరోజు ఆట‌ముగిసేస‌రికి 90 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 318 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో జైస్వాల్ తో పాటు కెప్టెన్ శుభ‌మాన్ గిల్ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జోమెల్ వ‌ర్రీక‌న్ కు రెండు వికెట్లు ద‌క్కాయి. ఇక తొలి టెస్టును ఇన్నింగ్స్ 140 ప‌రుగుల తేడాతో టీమిండియా ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ఇండియా ఆధిక్యంలో ఉంది. ఇక బ్యాటింగ్ కు అనుకూలించిన ఈ పిచ్ పై జైస్వాల్ పూర్తి ఫాయిదాను ద‌క్కించుకున్నాడు. కెరీర్ లో మూడో డ‌బుల్ సెంచ‌రీ వైపు దూసుకెళ్లాల‌ని భావిస్తున్నాడు. 

Continues below advertisement

Continues below advertisement

జైస్వాల్ జోరు..టాస్ గెలిచిన గిల్.. ఏమాత్రం రెండో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓపెన‌ర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (38) శుభారంభాన్నిచ్చారు. ముఖ్యంగా రాహుల్ కాస్త దూకుడుగా ఆడగా, జైస్వాల్ ఆరంభంలో కాస్త నెమ్మ‌దిగా ఆడాడు. ఇక జోరు కొన‌సాగించిన రాహుల్.. వ‌ర్రీక‌న్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో 58 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఈ ద‌శ‌లో వ‌న్ డౌన్ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (165 బంతుల్లో 87, 12 ఫోర్లు)తో క‌లిసి జైస్వాల్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా లంచ్ విరామానికి వెళ్లారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ ప‌ర్యాట‌క బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. 

ఏడో సెంచ‌రీ..లంచ్ విరామం త‌ర్వాత ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైస్వాల్.. సెంచ‌రీ వైపు దూసుకెళ్లాడు. మ‌రో ఎండ్ లో సాయి సుద‌ర్శ‌న కూడా ఆత్మ‌విశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. వీరిద్ద‌రూ చ‌క‌చ‌కా ప‌రుగులు చేయ‌డంతో స్కోరు బోర్డు కాస్త వేగంగానే సాగింది. ఈక్ర‌మంలో కెరీర్ లో ఏడో సెంచ‌రీని జైస్వాల్ పూర్తి చేసుకున్నాడు. మ‌రో ఎండ్ లో సెంచ‌రీ వైపు దూసుకెళుతున్న సుద‌ర్శ‌న్ ను చ‌క్క‌ని బంతితో వ‌ర్రీక‌న్ ఎల్బీగా ఔట్ చేశాడు. దీంతో రెండో వికెట్ కు న‌మోదైన‌193 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఇక జైస్వాల్ మాత్రం జోరు కొన‌సాగిస్తూ 150 ప‌రుగుల మార్కును కూడా చేరుకున్నాడు. మ‌రో ఎండ్ లో గిల్ కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్ద‌రూ అబేధ్య‌మైన మూడో వికెట్ కు 67 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఇక ప‌స లేని బౌలింగ్ తో వెస్టిండీస్ ఏమాత్రం ప్ర‌మాద‌క‌రంగా క‌నిపించ‌లేదు. కేవలం వర్రీకన్ మాత్రమే పిచ్ కు తగినట్లుగా బౌలింగ్ చేయగా, మిగతా వారు ఘోరంగా విఫలం అయ్యారని చెప్పుకోవచ్చు.