India lost despite posting a huge score in the second ODI in Raipur :  రాయపూర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పరాజంయ పాలైంది.  359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా దక్షిణాఫ్రికా ఆడుతూపాడుతూ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధిందింది.  ఓపెనర్ మార్కరమ్.. గట్టి పునాది వేశాడు . బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. 110 పరుగులు చేసి.. తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి లేకండా చేశాడు.  తొలి వికెట్ 26 పరుగుల వద్దే పడినా ఎక్కడా తడబడలేదు. తర్వాత వచ్చిన వారితో మంచి భాగస్వామ్యాలు నెలకొల్లాడు. టాప్ ఆర్డర్ అంతా.. మర్కరమ్‌కు సపోర్టు చేశారు.  వేగంగా పరుగులు తీశారు. బావుమా, మాధ్యుస్, బ్రేవిస్ ..మార్కరమ్ తో కలిసి .. విజయానికి దగ్గరకు చేర్చారు. మొదటి వన్డేలో గెలిపించడానికి చివరి వరకూ ప్రయత్నించి విఫలమైన బాష్  ఈ సారి మాత్రం తప్పు జరగనీయలేదు.

Continues below advertisement

భారతసంతతికి చెందిన దక్షిణాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్ తో కలిసి రన్ రేట్ కు అవసరమైనట్లుగా పరుగులు సాధించారు. చివరి ఓవర్లో నాలుగు పరుగులు అవసరమైతే..కంగారు పడకుండా సింగిల్స్, డబుల్స్ తో పూర్తి చేశారు. బౌండరితో  విజయం పూర్తి  చేశారు.  బాష్ ఫినిషింగ్ బాధ్యత తీసుకుని సింపుల్ గా లక్ష్యాన్ని చేర్చి..  సిరిస్ ను 1-1తో సమం చేశాడు. 

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు రుతురాజ్‌గైక్వాడ్, విరాట్ కోహ్లీ సెంచరీలతో రెచ్చిపోయారు. మొదట్లో బ్యాటింగ్ చేయడానికి భారత్ బ్యాట్స్‌మెన్ కాస్త ఇబ్బంది పడ్డారు. అదే టైంలో సఫారీలు మాత్రం వైడ్‌ల రూపంలో పరుగులు సమర్పించుకోవడంతో భారత్‌పై ఒత్తిడి పడలేదు. అయితే 62 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. అప్పుడు కోహ్లీకి గైక్వాడ్ జత కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 105 పరుగులు వద్ద అవుట్ అయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ 90 బంతుల్లో సెంచరీ చేశాడు.  తర్వాత స్కోరు పెంచే క్రమంలో 102 పరుగులకు అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్‌లు, రెండు సిక్స్‌లు కొట్టాడు. కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో .. భారత్ దక్షిణాఫ్రికాకు 359 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. 

Continues below advertisement

మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక  సిరీస్‌లోమరో మ్యాచ్ మిగిలి ఉంది. విన్నర్ ఎవరో మూడో వన్డేనే తేల్చనుంది. భారత్ ఇప్పటికే టెస్టు సీరిస్‌లో వైట్ వాష్‌కు గురైంది. అయితే రెండు మ్యాచ్‌లలోనూ  విరాట్ కోహ్లీ సెంచరీలు చేశాడు. తన 53వ వన్డే సెంచరీని సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో, అతను చరిత్రలో అత్యధిక వన్డే సెంచరీల రికార్డును తానే బద్దలు కొట్టాడు, 49 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ కంటే నాలుగు సెంచరీలు ముందంజలో ఉన్నాడు.

మూడో వన్డే  శనివారం, విశాఖపట్నంలో జరుగుతుంది.  విశాఖలో సిరీస్ ఫలితం తేలనుంది. టెస్టు సిరీస్‌లో పెద్దగా స్కోర్లు నమోదు కాలేదు. కానీ వన్డేల్లోమాత్రం పరుగుల వరద పారుతోంది. యాభై ఓవర్ల మ్యాచ్ లో 350కిపైగా పరుగులు సాధించినా సులువుగా  చేజింగ్ చేయడం చిన్న విషయం కాదు. అంతా పిచ్ మహిమ అనుకుంటున్నారు. విశాఖలోనూ పరుగుల వరద పారడం ఖాయమని అంచనా వేస్తున్నారు.